కొలంబో వేదికగా ఆదివారం టీమిండియాతో రెండో వన్డేలో శ్రీలంక తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగ గాయం కారణంగా భారత్‌తో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు.
మోకాలి గాయం కారణంగా హసరంగా మిగిలిన రెండు వన్డేలకు దూరమయ్యాడు. టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో హసరంగా మోకాలికి గాయమైంది. అయినప్పటకి మ్యాచ్ మొత్తానికి వనిందు అందుబాటులో ఉన్నాడు.
కానీ ఆ తర్వాత స్కానింగ్‌లో అతడి గాయం తీవ్రమైనదిగా తేలడంతో వైద్యులు విశ్రాంతి అవసరమని సూచించారు. ఈ క్రమంలోనే హసరంగా సిరీస్ మధ్యలోనే వైదొలిగాడు. కాగా భారత్‌తో తొలి వన్డే టైగా ముగియడంలో హసరంగా కీలక పాత్ర పోషించాడు.
ఇక ఈ సిరీస్‌కు ఇప్పటికే శ్రీలంక స్టార్ పేసర్లు మతీషా పతిరనా, దిల్షాన్ మధుశంక కూడా దూరమయ్యారు. ఇప్పుడు హసరంగా కూడా తప్పుకోవడం ఆతిథ్య జట్టుకు నిజంగా గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. హసరంగా స్ధానాన్ని జెఫ్రీ వాండర్సేతో శ్రీలంక క్రికెట్ భర్తీ చేసింది.
చదవండి: ‘టై’ని బ్రేక్ చేసేదెవరో?
Comments
Please login to add a commentAdd a comment