పల్లెకలె వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో శ్రీలంక 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో ఆతిథ్య శ్రీలంక సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 45.1 ఓవర్లలో 209 పరుగులకే ఆలౌటైంది.
మార్క్ చాప్‌మన్ (81 బంతుల్లో 76; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), మిచెల్ హే (62 బంతుల్లో 49; 4 ఫోర్లు) రాణించారు. శ్రీలంక బౌలర్లలో వాండర్సే, తీక్షణ చెరో 3 వికెట్లు తీయగా, అసిత ఫెర్నాండో 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 210 పరుగుల సులువైన లక్ష్యాన్ని చేధించేందుకు లంకేయులు తీవ్రంగా శ్రమించారు. చివరకు 46 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసి గెలిచింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కుశాల్ మెండీస్ (102 బంతుల్లో 74 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా... మిగతావారిలో ఓపెనర్ నిసాంక (28; 4 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో (5), కమిండు (0), కెపె్టన్ అసలంక (13), సమరవిక్రమ (8) విఫలమవడంతో లంక 163 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.
83 బంతుల్లో 47 పరుగులు చేయాల్సివుండగా... కుశాల్, మహీశ్ తీక్షణ (44 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) అబేధ్యమైన ఎనిమిదో వికెట్‌కు అవసరమైన 47 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. బ్రాస్‌వెల్ 4, సాంట్నర్, ఫిలిప్స్, స్మిత్ తలా ఒక వికెట్ తీశారు. మంగళవారం ఇదే వేదికపై ఆఖరి వన్డే జరుగనుంది. కాగా 2012 తర్వాత కివీస్‌పై శ్రీలంక వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి.
చదవండి: రోహిత్ వచ్చినా అతడినే కెప్టెన్‌గా కొనసాగించండి: హర్భజన్
Comments
Please login to add a commentAdd a comment