ICC T20I Rankings: Josh Hazlewood Rises to 2nd Spot in T20I Bowling Rankings - Sakshi
Sakshi News home page

ICC T20 Rankings: ఐపీఎల్‌లో ఎవరూ కొనలేదు.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ 1గా... రెండో స్థానంలో ఆసీస్‌ పేసర్‌

Published Wed, Feb 16 2022 5:06 PM | Last Updated on Wed, Feb 16 2022 9:35 PM

ICC T20 Rankings: Josh Hazlewood Tabraiz Shamsi Move Up - Sakshi

ICC T20 Rankings: ఆస్ట్రేలియా పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. టీ20 ఫార్మాట్‌ బౌలర్ల విభాగంలో నాలుగు స్థానాలు ఎగబాకాడు. 783 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్‌ తబ్రేజ్‌ షంసీ (784 పాయింట్లు) అగ్రస్థానానికి చేరుకున్నాడు. అతడి కంటే ఒకే ఒక్క పాయింట్‌ వెనుకబడి ఉన్న హాజిల్‌వుడ్‌ ద్వితీయ స్థానానికి పరిమితమయ్యాడు. కాగా శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న అతడు ఈ మేరకు టాప్‌-2లో చోటు దక్కించుకోవడం విశేషం. 

ఇక లంకతో సిరీస్‌లో హాజిల్‌వుడ్‌ వరుసగా 4, 3(ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌), ఒక వికెట్‌ పడగొట్టాడు. ఇప్పటికే 3-0 తేడాతో ఈ సిరీస్‌ను ఆసీస్‌ కైవసం చేసుకుంది. కాగా శ్రీలంక ఆటగాడు వనిందు హసరంగ, ఆదిల్‌ రషీద్‌(ఇంగ్లండ్‌), ఆడం జంపా(ఆస్ట్రేలియా), రషీద్‌ ఖాన్‌(అఫ్గనిస్తాన్‌), ముజీబ్‌ ఉర్‌ రహమాన్‌(అఫ్గనిస్తాన్‌), అన్రిచ్‌ నోర్జే(దక్షిణాఫ్రికా), షాబాద్‌ ఖాన్‌(పాకిస్తాన్‌), టిమ్‌ సౌథీ(న్యూజిలాండ్‌) టాప్‌-10లో చోటు దక్కించుకున్నారు.

ఇదిలా ఉండగా.. ఐపీఎల్‌ మెగా వేలం-2022లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 7.75 కోట్లు వెచ్చించి హాజిల్‌వుడ్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో ఉన్న తబ్రేజ్‌ అమ్ముడుపోకుండా మిగిలిపోయిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement