శ్రీలంక కెప్టెన్సీకి హసరంగ రాజీనామా | Hasaranga resigns from Sri Lanka captaincy | Sakshi
Sakshi News home page

శ్రీలంక కెప్టెన్సీకి హసరంగ రాజీనామా

Published Fri, Jul 12 2024 4:39 AM | Last Updated on Fri, Jul 12 2024 11:39 AM

Hasaranga resigns from Sri Lanka captaincy

కొలంబో: శ్రీలంక టి20 క్రికెట్‌ జట్టు కెపె్టన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు లెగ్‌ స్పిన్నర్‌ హసరంగ ప్రకటించాడు. శ్రీలంక క్రికెట్‌ మేలు కోరే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు, జట్టులో సభ్యుడిగా కొనసాగుతానని హసరంగ వివరించాడు. హసరంగ రాజీనామా నేపథ్యంలో ఈ నెలాఖరులో స్వదేశంలో భారత జట్టుతో జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో శ్రీలంక కొత్త కెపె్టన్‌ ఆధ్వర్యంలో ఆడుతుంది. 

గత నెలలో వెస్టిండీస్‌–అమెరికాలలో జరిగిన టి20 ప్రపంచకప్‌లో హసరంగ నేతృత్వంలో ఆడిన శ్రీలంక లీగ్‌ దశలోనే ఇంటిదారి పట్టింది. జట్టు పేలవ ప్రదర్శన కారణంగా హెడ్‌ కోచ్‌ క్రిస్‌ సిల్వర్‌వుడ్‌ తన పదవికి రాజీనామా చేయగా, కోచ్‌ బాటనే కెపె్టన్‌ అనుసరించాడు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement