టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం 15 మంది సభ్యుల శ్రీలంక జట్టును ఇవాళ (మే 9) ప్రకటించారు. ఈ జట్టుకు స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ నాయకత్వం వహించనున్నాడు. చరిత్ అసలంక వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. స్టార్లతో నిండిన ఈ జట్టులో వెటరన్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌కు కూడా చోటు దక్కింది.
ఐపీఎల్ హీరో మతీశ పతిరణ బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించనున్నాడు. సన్‌రైజర్స్ బౌలర్, జాఫ్నా కుర్రాడు విజయ్‌కాంత్ వియాస్‌కాంత్ మరో ముగ్గురితో సహా ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపికయ్యాడు.
జూన్ 1 నుంచి వెస్టిండీస్, యూఎస్‌ఏ వేదికగా జరిగే వరల్డ్‌కప్‌లో శ్రీలంక ప్రస్తానం జూన్ 3న మొదలవుతుంది. న్యూయార్క్‌లో జరిగే తమ తొలి మ్యాచ్‌లో లంకేయులు సౌతాఫ్రికాను ఢీకొంటారు. ఈ వరల్డ్‌కప్‌లో శ్రీలంక గ్రూప్-డిలో బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్, నేపాల్ జట్లతో పోటీపడుతుంది. ఈ వరల్డ్‌కప్‌కు శ్రీలంక క్వాలిఫయర్ పోటీల ద్వారా అర్హత సాధించింది.
కాగా, మొత్తం 20 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో లంకతో కలుపుకుని ఇప్పటివరకు 16 జట్లు ప్రకటించబడ్డాయి. పాకిస్తాన్, నమీబియా, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ ఇంకా తమ జట్లను ప్రకటించాల్సి ఉంది. ఈ టోర్నీలో భారత్ ప్రస్తానం జూన్ 5న మొదలవుతుంది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో వరల్డ్‌కప్‌లో టీమిండియా పోరాటం ప్రారంభమవుతుంది. జూన్ 9న టీమిండియా చిరకాల ప్రత్యర్ది పాకిస్తాన్‌తో తలపడుతుంది.
టీ20 ప్రపంచకప్ 2024 కోసం శ్రీలంక జట్టు..
వనిందు హసరంగ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), కుశాల్ మెండిస్, పథుమ్ నిస్సంక, కమిందు మెండిస్, సదీర సమరవిక్రమ, ఏంజెలో మాథ్యూస్, దసున్ షనక, ధనంజయ డి సిల్వా, మహీశ్ తీక్షణ, దునిత్ వెల్లలగే, దుష్మంత చమీరా, నువాన్ తుషార, మతీశ పతిరణ, దిల్షన్ మధుశంక
ట్రావెలింగ్ రిజర్వ్‌లు: అసిత ఫెర్నాండో, విజయకాంత్ వియస్‌కాంత్, భానుకా రాజపక్సే, జనిత్ లియనాగే
Comments
Please login to add a commentAdd a comment