CWC Qualifier 2023 Super Six Stage: Sri Lanka Wins 7 ODIs In A Row, See Details - Sakshi
Sakshi News home page

CWC Qualifier 2023: అజేయ శ్రీలంక.. పూర్వ వైభవం దిశగా అడుగులు

Published Sat, Jul 1 2023 8:22 AM | Last Updated on Sat, Jul 1 2023 9:19 AM

CWC Qualifier 2023: Sri Lanka Wins 7 ODIs In A Row - Sakshi

1990 దశ​కం మధ్యలో క్రికెట్‌ ప్రపంచాన్ని ఉర్రూతలూగించి, ఆ తర్వాత దాదాపు రెండు దశాబ్దాల పాటు జెంటిల్మెన్‌ గేమ్‌పై ఏకఛత్రాధిపత్యం చలాయించి, ఈ మధ్యలో రెండుసార్లు (1996 వన్డే వరల్డ్‌కప్‌, 2014 టీ20 వరల్డ్‌కప్‌) జగజ్జేతగా నిలిచిన శ్రీలంక క్రికెట్‌ జట్టు.. స్టార్‌ క్రికెటర్లు ఒక్కొక్కరిగా నిష్క్రమించడంతో గత కొద్దికాలంగా అతి సాధారణ జట్టుగా మారిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే ఆ జట్టు తిరిగి గాడిలో పడుతున్నట్లు కనిపిస్తుంది.

టెస్ట్‌లను, టీ20లను పక్కన పెడితే ఆ జట్టు ఇటీవలికాలంలో వన్డేల్లో వరుస విజయాలు సాధిస్తూ పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తుంది. నిన్నటి వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌-2023 సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై గెలుపుతో కలిపుకుని ఇటీవలికాలంలో ఆ జట్టు  వరుసగా 7 విజయాలు సాధించింది. స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌పై రెండో వన్డే మొదలైన ఆ జట్టు గెలుపు ప్రస్థానం.. నిన్నటి నెదర్లాండ్స్‌ మ్యాచ్‌ వరకు నిరాటంకంగా సాగింది.  

ఫలితంగా 2023 వన్డే ప్రపంచకప్‌ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. శ్రీలంక సాధిస్తున్న వరస విజయాల్లో స్పిన్నర్‌ వనిందు హసరంగ, వెరటన్‌ బ్యాటర్‌ దిముత్‌ కరుణరత్నే ప్రధానపాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా హపరంగ ప్రతి మ్యాచ్‌లో వికెట్లు తీస్తూ ప్రత్యర్దులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. క్వాలిఫయర్స్‌లో ఇప్పటివరకు ఆతను 5 మ్యాచ్‌ల్లో ఏకంగా 20 వికెట్లు పడగొట్టాడు. ఇందులో హ్యాట్రిక్‌ ఫైఫర్లు (5 వికెట్ల ఘనత) ఉన్నాయి. 

క్వాలిఫయర్స్‌లో సూపర్‌ సిక్స్‌ విషయానికొస్తే.. ఈ దశలో శ్రీలంక (6 పాయింట్లు) అని​ జట్ల కంటే టాప్‌లో ఉంది. జింబాబ్వే కూడా సమానమైన పాయింట్లే కలిగి ఉన్నప్పటికీ.. ఆ జట్టు నెట్‌ రన్‌రేట్‌ శ్రీలంకతో పోలిస్తే తక్కువగా ఉంది. ఈ దశలో స్కాట్లాండ్‌, నెదర్లాండ్స్‌ 3,4 స్థానాల్లో ఉండగా.. వెస్టిండీస్‌ 0 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి, 2023 వరల్డ్‌కప్‌ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement