ODI World Cup Qualifiers 2023: Sri Lanka beat UAE by 175 runs - Sakshi
Sakshi News home page

#CWCQualifiers2023: చెలరేగిన హసరంగా.. ICC CWC Qualifiersలో లంక శుభారంభం

Published Tue, Jun 20 2023 8:40 AM | Last Updated on Tue, Jun 20 2023 12:43 PM

Sri Lanka-Big-Win-175 Runs-Margin-Vs UAE-ICC Cricket WC Qualifiers 2023 - Sakshi

ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌ పోరును శ్రీలంక ఘనంగా ఆరంభించింది. సోమవారం యూఏఈతో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో లంక 175 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. లంక స్పిన్నర్‌ వనిందు హసరంగా ఆరు వికెట్లతో(6/24) యూఏఈ పతనాన్ని శాసించాడు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 355 పరుగులు చేసింది.

కుశాల్‌ మెండిస్‌(63 బంతుల్లో 78, 10 ఫోర్లు), సదీరా సమరవిక్మ(64 బంతుల్లో 73), పాతుమ్‌ నిసాంకా(76 బంతుల్లో 57), దిముత్‌ కరుణరత్నే(54 బంతుల్లో 52) అర్థసెంచరీలతో రాణించగా.. ఆఖర్లో అసలంక 23 బంతుల్లో 48 నాటౌట్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ హసరంగా దాటికి 39 ఓవర్లలో 180 పరుగులకే కుప్పకూలింది. వసీమ్‌(39), అరవింద్‌(39), నసీర్‌(34) పర్వాలేదనిపించారు. 

చదవండి: ఔటయ్యి కూడా చరిత్రకెక్కిన జో రూట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement