సెంచరీతో కదంతొక్కిన కరుణరత్నే.. దిగ్గజాల సరసన చోటు | CWC Qualifiers 2023 SL VS IRE: Dimuth Karunaratne Scripts Major Records With Maiden ODI Century | Sakshi
Sakshi News home page

CWC Qualifiers 2023: సెంచరీతో కదంతొక్కిన కరుణరత్నే.. దిగ్గజాల సరసన చోటు

Published Sun, Jun 25 2023 4:35 PM | Last Updated on Sun, Jun 25 2023 6:15 PM

CWC Qualifiers 2023 SL VS IRE: Dimuth Karunaratne Scripts Major Records With Maiden ODI Century - Sakshi

వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ 2023లో భాగంగా ఐర్లాండ్‌తో ఇవాళ (జూన్‌ 25) జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక ఓపెనర్‌ దిముత్‌ కరుణరత్నే (103 బంతుల్లో 103; 8 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కాడు. ఈ శతకం కరుణరత్నేకు వన్డేల్లో తొట్టతొలిది కావడం విశేషం. టెస్ట్‌ల్లో 16 శతకాలు బాదిన కరుణరత్నే.. దాదాపు రెండేళ్ల తర్వాత ఇటీవలే వన్డే జట్టులోకి వచ్చి తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో కరుణరత్నే వన్డేల్లో 1000 పరుగులు (40 మ్యాచ్‌ల్లో సెంచరీ, 10 హాఫ్‌ సెంచరీల సాయంతో 1095 పరుగులు) పూర్తి చేసుకోవడంతో పాటు ఓ అరుదైన ఫీట్‌ సాధించి, దిగ్గజాల సరసన చేరాడు. 

కరుణరత్నే.. ఈ మ్యాచ్‌తో కలుపుకుని తన చివరి 5 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 50 ప్లస్‌ స్కోర్‌లు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 103, దీనికి ముందు ఒమన్‌పై 61 నాటౌట్‌, యూఏఈపై 42, ఆఫ్ఘనిస్తాన్‌పై 56 నాటౌట్‌, ఆఫ్ఘనిస్తాన్‌పై 52 పరుగులు స్కోర్‌ చేశాడు. గతంలో శ్రీలంక తరఫున ఇలా 5 వరుస ఇన్నింగ్స్‌ల్లో 5 ఫిఫ్టి ప్లస్‌ స్కోర్లు చేసిన ఆటగాళ్లు నలుగురు ఉన్నారు. సనత్‌ జయసూర్య, కుమార సంగక్కర, తిలకరత్నే దిల్షన్‌, దినేశ్‌ చండీమాల్‌.. కరుణరత్నే కంటే ముందు ఈ రేర్‌ ఫీట్‌ను సాధించారు. తాజాగా కరుణరత్నే ఈ ఫీట్‌ను సాధించడంతో దిగ్గజ క్రికెటర్లు జయసూర్య,సంగక్కర సరసన చేరాడు. వన్డేల్లో వరుసగా ఫిప్టి ప్లస్‌ చేసిన రికార్డు పాకిస్తాన్‌ జావిద్‌ మియాందాద్‌ (9 వరుస 50 ప్లస్‌ స్కోర్లు) పేరిట ఉంది.

ఇదిలా ఉంటే, గ్రూప్‌-బిలో భాగంగా ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 49.5 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌటైంది. కరుణరత్నే సెంచరీతో కదంతొక్కగా.. సదీర సమరవీర (82) అర్ధసెంచరీతో రాణించాడు. చరిత్‌ అసలంక (38), ధనంజయ డిసిల్వ (42 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఐర్లాండ్‌ బౌలర్లలో మార్క్‌ అదైర్‌ 4, బ్యారీ మెక్‌కార్తీ 3, గెరత్‌ డెలానీ 2 వికెట్లు పడగొట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement