ల‌క్నో జ‌ట్టులోకి సౌతాఫ్రికా సూప‌ర్‌ స్టార్‌ | Wanindu Hasaranga ruled out of IPL 2026, LSG close in on overseas spin replacement | Sakshi
Sakshi News home page

IPL 2026: ల‌క్నో జ‌ట్టులోకి సౌతాఫ్రికా సూప‌ర్‌ స్టార్‌

Apr 10 2026 4:46 PM | Updated on Apr 10 2026 4:59 PM

Wanindu Hasaranga ruled out of IPL 2026, LSG close in on overseas spin replacement

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. శ్రీలంక స్టార్ ఆల్‌రౌండ‌ర్ వ‌నిందు హ‌స‌రంగ గాయం కార‌ణంగా సీజ‌న్ మొత్తానికి దూర‌మ‌య్యాడు. ఫ‌స్ట్ హాఫ్ సీజ‌న్ త‌ర్వాత హ‌స‌రంగ జ‌ట్టుతో చేరుతాడ‌ని ల‌క్నో మేనెజ్‌మెంట్‌ భావించింది. కానీ అత‌డు త‌న మోకాలి గాయం నుంచి కోలుకోవ‌డానికి మ‌రింత స‌మ‌యం ప‌ట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది.

తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్వ‌హించిన ఫిట్‌నెస్ ప‌రీక్ష‌ల్లో హ‌స‌రంగ ఉత్తీర్ణ‌త సాధించలేక‌పోయాడు. ఈ క్ర‌మంలోనే ఐపీఎల్ 19వ సీజ‌న్ నుంచి హ‌స‌రంగా వైదొలిగాడు. ఈ విష‌యాన్ని లక్నో జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ టామ్ మూడీ ధ్రువీకరించాడు. అయితే హ‌స‌రంగ స్ధానాన్ని సౌతాఫ్రికా స్టార్ ఆల్‌రౌండ‌ర్ జార్జ్ లిండేతో ల‌క్నో భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇప్ప‌టికే లిండేతో ల‌క్నో ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు స‌మాచారం. దీనిపై తదుపరి 24 నుంచి 48 గంటల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ ప్రోటీస్ ఆల్‌రౌండ‌ర్‌కు ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్‌లలో ఆడిన అనుభ‌వం ఉంది. ఈ ఎడమచేతి వాటం స్పిన్నర్  250 పైగా టీ20 మ్యాచ్‌ల్లో 218 వికెట్లు పడగొట్టాడు. 

లిండేకు లోయార్డ‌ర్‌లో బ్యాటింగ్ చేసే స‌త్తా కూడా ఉంది. లక్నో జట్టులో ఇప్పటికే షాబాజ్ అహ్మద్, ఎం. సిద్ధార్థ్ వంటి లెఫ్ట్ ఆర్మ్‌ స్పిన్నర్లు ఉన్నారు. కానీ హ‌స‌రంగ లాంటి స్టార్ ఆల్‌రౌండ‌ర్ స్ధానాన్ని భ‌ర్తీ చేసేందుకు ల‌క్నో మొగ్గు చూపుతోంది. కాగా ఈ ఏడాది సీజన్‌లో లక్నో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడి రెండింట విజయం సాధించింది.
చదవండి: నాపై కోపంతో చెత్తబుట్టలో పడేశాడు.. అతడి తండ్రి వచ్చి..: యువీ
 

Advertisement
 
Advertisement
Advertisement