సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు బిగ్‌ షాక్‌!? | Wanindu Hasaranga Set To Miss Initial Stages Of IPL 2024 | Sakshi
Sakshi News home page

IPL 2024: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు బిగ్‌ షాక్‌!?

Published Tue, Mar 19 2024 8:56 AM | Last Updated on Tue, Mar 19 2024 10:41 AM

Wanindu hasaranga Set To Miss Initial Stages Of IPL 2024 - Sakshi

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

ఐపీఎల్‌-2024 సీజన్‌ ఆరంభానికి ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఈ ఏడాది సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఆడే తొలి మూడు మూడు మ్యాచ్‌లకు ఆ జట్టు స్టార్‌ స్పిన్నర్‌, శ్రీలంక టీ20 కెప్టెన్‌ వనిందు హసరంగా దూరం కానున్నాడు. జాతీయ జట్టు విధుల కారణంగా అతడు భారత్‌కు రావడం కాస్త ఆలస్యం కానుంది.

బంగ్లాదేశ్‌తో శ్రీలంక రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. తాజాగా ఈ సిరీస్‌కు ప్రకటించిన శ్రీలంక జట్టులో హసరంగాకు సైతం చోటు దక్కింది. తన టెస్టు క్రికెట్‌ రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో హసరంగాను సెలక్టర్లు ఎంపిక చేశారు.

మార్చి 22 న ప్రారంభమయ్యే ఈ సిరీస్‌ ఏప్రిల్‌ 3న ముగియనుంది. ఆ తర్వాత హసరంగా ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టుకు అందుబాటులో ఉంటాడు. అయితే వనిందు ముందే తన నిర్ణయాన్ని సన్‌రైజర్స్‌ మెనెజ్‌మెంట్‌కు తెలియజేసినట్లు సమాచారం. ఈ ఏడాది వేలంలో హసరంగాను రూ.1.50 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్‌ సొంతం చేసుకుంది. 

                                       

ఇక మార్చి 22 నుంచి ఐపీఎల్‌-2024 సీజన్‌ ప్రారంభం కానుంది. చెపాక్‌ వేదికగా జరగనున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మ్యాచ్‌తో ఈ క్యాష్‌రిచ్‌ లీగ్‌కు తెరలేవనుంది. ఎస్‌ఆర్‌హెచ్‌ విషయానికి వస్తే.. తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది.
చదవండి: BAN vs SL: రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్న స్టార్‌ క్రికెటర్‌.. 3 ఏళ్ల తర్వాత ఎంట్రీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement