IND Vs SL: Sri Lanka Announce 20-Member Squad For ODI, T20I Series Against India - Sakshi
Sakshi News home page

Ind Vs SL 2023: టీమిండియాతో టీ20, వన్డే సిరీస్‌లు.. శ్రీలంక జట్టు ప్రకటన

Published Thu, Dec 29 2022 7:53 AM | Last Updated on Thu, Dec 29 2022 9:11 AM

Ind Vs SL 2023: Sri Lanka Announced 20 Member Squad - Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ- లంక సారథి దసున్‌ (ఫైల్‌ ఫొటో: SL Cricket Twitter)

India vs Sri Lanka 2023 T20 And ODI Series- కొలంబో: భారత్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీస్‌లలో పాల్గొనే శ్రీలంక జట్టును ప్రకటించారు. రెండు ఫార్మాట్లకు కలిపి 20 మంది సభ్యులతో కూడిన జట్టుకు షనక సారథ్యం వహిస్తాడు. కాగా వచ్చే నెలలో శ్రీలంక జట్టు భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. టీమిండియాతో మూడు టీ20, మూడు వన్డేల సిరీస్‌లు ఆడనుంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరు సిరీస్‌లకు బీసీసీఐ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీలంక బోర్డు సైతం టీమిండియాను ఢీకొట్టే తమ జట్టు వివరాలు బుధవారం వెల్లడించింది. రెండు సిరీస్‌లకు దసున్‌ షనక కెప్టెన్‌ కాగా.. వన్డేలకు కుశాల్‌ మెండిస్‌, టీ20లకు వనిందు హసరంగ వైస్‌ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఇక టీమిండియా- శ్రీలంక మధ్య 3, 5, 7 తేదీల్లో టీ20, 10, 12, 15 తేదీల్లో వన్డే సిరీస్‌ జరుగనుంది. 

భారత్‌తో సిరీస్‌- శ్రీలంక జట్టు వివరాలు:
దసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిసాంక, అవిష్క ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, కుశాల్ మెండిస్ (వన్డేలకు వైస్‌ కెప్టెన్‌), చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగ (టీ20 వైస్‌ కెప్టెన్‌), ఆషేన్‌ బండార, మహీశ్‌ తీక్షణ, జెఫ్రీ వాండర్సే (వన్డేలకు మాత్రమే), చమికా కరుణరత్నే, దిల్షాన్ మధుశంక, కసున్ రజిత, నువానీదు ఫెర్నాండో (వన్డేలకు మాత్రమే), దునిత్ వెల్లలగే, ప్రమోద్ మధుషన్, లాహిరు కుమార, నువాన్ తుషార (టీ20లకు మాత్రమే)

►టి20లకు మాత్రమే: భానుక రాజపక్స, తుషార.
►వన్డేలకు మాత్రమే: వండెర్సే, నువానిడు ఫెర్నాండో.   

చదవండి: T20 WC 2023: టీ20 ప్రపంచకప్‌ జట్టు ప్రకటన.. ఇద్దరు ఏపీ అమ్మాయిలకు చోటు!
Ind Vs SL T20 Series: సెంచరీ బాదినా కనబడదా? నువ్వు ఐర్లాండ్‌ వెళ్లి ఆడుకో​! ఇక్కడుంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement