చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్‌.. తొలి బౌలర్‌గా | Wanindu Hasaranga Becomes Fastest Sri Lankan to 100 T20I Wickets | Sakshi
Sakshi News home page

AFG vs SL: చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్‌.. తొలి బౌలర్‌గా

Published Tue, Feb 20 2024 12:09 PM | Last Updated on Tue, Feb 20 2024 12:31 PM

Wanindu Hasaranga Becomes Fastest Sri Lankan to 100 T20I Wickets - Sakshi

అంతర్జాతీయ టీ20ల్లో శ్రీలంక కెప్టెన్‌ వనిందు హసరంగా 100 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్‌ జరిగిన రెండో టీ20లో 2 వికెట్లు పడగొట్టిన హసరంగా.. 100 వికెట్ల క్లబ్‌లో చేరాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను హసరంగా తన పేరిటి లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంతవేగంగా 100 వికెట్లు పడగొట్టిన శ్రీలంక బౌలర్‌గా వనిందూ రికార్డులకెక్కాడు.

హసరంగా 63 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక దిగ్గజం లసిత్‌ మలింగ(76 మ్యాచ్‌లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో మలింగ ఆల్‌టైమ్‌ రికార్డును హసరంగా బ్రేక్‌ చేశాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో అఫ్గాన్‌ స్టార్‌ రషీద్‌(53) ఖాన్‌ ఉన్నాడు.

కాగా అంతర్జాతీయ టీ20ల్లో మలింగ తర్వాత 100 వికెట్లు తీసిన రెండో బౌలర్‌ కూడా హసరంగానే కావడం గమనార్హం. ఓవరాల్‌గా ఈ ఫీట్‌ సాధించిన జాబితాలో 11 స్ధానంలో వనిందూ నిలిచాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. 72 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌ను శ్రీలంక చిత్తు చేసింది. దీంతో మరో మ్యాచ్‌ మిగిలూండగానే సిరీస్‌ను 2-0 తేడాతో శ్రీలంక కైవసం చేసుకుంది.
చదవండిRanchi Test: టీమిండియాకు బిగ్‌ షాక్‌.. డబుల్‌ సెంచరీల వీరుడు దూరం!?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement