వనిందు హసరంగ(Photo Courtesy: BCCI/IPL)
ఐపీఎల్-2022లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆల్‌రౌండర్ వనిందు హసరంగ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లు బౌలింగ్ వేసిన ఈ శ్రీలంక ప్లేయర్ కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సహా సునిల్ నరైన్, షెల్డన్ జాక్సన్, టిమ్ సౌథీల వికెట్లు తీశాడు.
తద్వారా ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అయితే, బంతితో రాణించినప్పటికీ ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ బ్యాటర్‌గా మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఇదిలా ఉండగా.. వికెట్లు తీసిన అనంతరం హసరంగ సెలబ్రేట్ చేసుకున్న తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్ ప్లేయర్ నెయ్‌మార్‌ను తలపిస్తూ సంబరాలు చేసుకున్న తీరు వైరల్‌గా మారింది.
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ హసరంగ మాట్లాడుతూ.. 4 వికెట్లతో రాణించడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. ‘‘కీలక సమయంలో నేను కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాను. ఏదేమైనా సంతోషంగా ఉన్నా. ముఖ్యంగా మంచు ప్రభావం చూపిన ఈ పిచ్‌పై బౌలింగ్ చేయడం కష్టంగా తోచింది’’ అని పేర్కొన్నాడు. ఇక తన ఫేవరెట్ ఫుట్‌బాలర్ నెయ్‌మార్ అని చెప్పిన హసరంగ.. అందుకే వికెట్ తీసినపుడు అతడి స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్నట్లు వెల్లడించాడు.
అదే విధంగా.. ఒక్కసారి మైదానంలోకి దిగాక అస్సలు ఒత్తిడికి గురికానని, తన విజయానికి కారణం ఇదేనంటూ వ్యాఖ్యానించాడు. కాగా బుధవారం నాటి మ్యాచ్‌లో ఆర్సీబీ కేకేఆర్‌పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించి ఈ సీజన్‌లో తమ తొలి గెలుపును నమోదు చేసింది.
చదవండి: Harshal Patel: ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా హర్షల్ పటేల్
That's that from Match 6 of #TATAIPL.
— IndianPremierLeague (@IPL) March 30, 2022
A nail-biter and @RCBTweets win by 3 wickets.
Scorecard - https://t.co/BVieVfFKPu #RCBvKKR #TATAIPL pic.twitter.com/2PzouDTzsN
Comments
Please login to add a commentAdd a comment