Harbhajan Says Mayank Agarwal Kept Soaking Everything Looks Suffocated - Sakshi
Sakshi News home page

Mayank Agarwal:'కెప్టెన్సీ భారం మంచి బ్యాటర్‌ను చంపేసింది'

Published Thu, Jun 2 2022 10:38 AM | Last Updated on Thu, Jun 2 2022 12:21 PM

Harbhajan Says Mayank Agarwal Kept Soaking Everything Looks Suffocated - Sakshi

ఐపీఎల్‌ 2022 సీజన్‌ కొందరు టీమిండియా ఆటగాళ్లకు పూర్వ వైభవం తీసుకొస్తే.. మరికొందరికి మాత్రం చేదు అనుభవం మిగిల్చింది. యజ్వేంద్ర చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా లాంటి క్రికెటర్లు ఫామ్‌ కోల్పోయి సతమతమవుతున్న వేళ ఐపీఎల్‌ వారికి కలిసొచ్చింది. అయితే కోహ్లి, రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌ సహా మరికొంత మంది ఆటగాళ్లు మాత్రం ఘోర ప్రదర్శన చేశారు. బ్యాటింగ్‌ స్టార్స్‌ కోహ్లి, రోహిత్‌ల సంగతి పక్కనబెడితే. వీరి కంటే ఎక్కువగా ఇబ్బంది పడింది మాత్రం మయాంక్‌ అగర్వాల్‌ అని చెప్పొచ్చు.


PC: IPL Twitter
కేఎల్‌ రాహుల్‌ లక్నో సూపర్‌ జెయింట్స్‌కు వెళ్లిపోవడంతో పంజాబ్‌ కింగ్స్‌ ఫుల్‌టైమ్‌ కెప్టెన్‌గా మయాంక్‌ ఎంపికయ్యాడు. దీంతో కెప్టెన్సీ భారం మీద పడడంతో మయాంక్‌ తనలోని బ్యాట్స్‌మన్‌ను పూర్తిగా మరిచిపోయాడు. 13 మ్యాచ్‌లు ఆడిన మయాంక్‌ ఒకే ఒక హాఫ్‌ సెంచరీతో కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. ఇదే మయాంక్‌ గత ఐపీఎల్‌ సీజన్‌లో 12 మ్యాచ్‌ల్లో 441 పరుగులతో దుమ్మురేపాడు. ఇక ఈ సీజన్‌లో కెప్టెన్‌గా జట్టును కూడా అంతంత మాత్రంగానే నడిపించాడు. పంజాబ్‌ కింగ్స్‌ 14 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు.. ఏడు ఓటములతో ఈ సీజన్‌ను ఆరో స్థానంతో ముగించింది. కాగా టీమిండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ మయాంక్‌ అగర్వాల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


PC: IPL Twitter
''అసలు మయాంక్‌ అగర్వాల్‌కు ఏమైంది.. అతన్ని చూడగానే నా మదిలోకి వచ్చిన మొదటి ప్రశ్న. నిజానికి అతను మంచి స్ట్రైకింగ్‌ ప్లేయర్‌. అయితే ఐపీఎల్‌లో కెప్టెన్సీ అతని కొంపముంచింది. కెప్టెన్సీ భారం అతనిలోని మంచి బ్యాటర్‌ను చంపేసింది. ఈ సీజన్‌లో పంజాబ్‌కు కెప్టెన్‌గా పనిచేసిన మయాంక్‌ ఓపెనింగ్‌ నుంచి నాలుగో స్థానం వరకు బ్యాటింగ్‌ చేసినప్పటికి ఫలితం లేకుండా పోయింది. నాయకత్వం తలకు మించిన భారం కావడంతో ప్రతీసారి మయాంక్‌ మొహంలో చిరాకు స్పష్టంగా కనిపించేది. అతన్ని కెప్టెన్‌ చేయకుండా ఒక బ్యాటర్‌గా స్వేచ్ఛగా ఆడనిచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది.'' అని చెప్పుకొచ్చాడు.


PC: IPL Twitter
ఇక ఆర్సీబీ బౌలర్‌ వనిందు హసరంగాను భజ్జీ ప్రశంసల్లో ముంచెత్తాడు.'' హసరంగా ఒక దశలో ఆర్సీబీకి మ్యాచ్‌ విన్నర్‌గా మారాడు. నిజానికి అతను సర్‌ప్రైజ్‌ బౌలర్‌. తన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్లను ముప్పతిప్పలు పెట్టాడు. సక్సెస్‌ వెనుకు అతను పడ్డ కష్టం కనిపించింది. అతని బౌలింగ్‌ను నేను బాగా ఎంజాయ్‌ చేశాను.'' అంటూ తెలిపాడు. ఇక హసరంగా పర్పుల్‌ క్యాప్‌కు ఒక్క వికెట్‌ దూరంలో ఆగిపోయాడు. ఈ సీజన్‌లో హసరంగా 16 మ్యాచ్‌లాడి 27 వికెట్లు పడగొట్టాడు. 

చదవండి: Krunal- Hardik Pandya: 'నిన్ను మరిచిపోయే స్టేజ్‌కు వచ్చారు.. గోడకు కొట్టిన బంతిలా'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement