శ్రీలంక స్టార్ క్రికెటర్ వనిందు హసరంగ తన చెల్లి పెళ్లిలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. అప్పగింతల కార్యక్రమం సందర్భంగా చెల్లిని, బావను కౌగిలించుకుని కన్నీటిపర్యంతమయ్యాడు. చెల్లితో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బోరున విలపించాడు. ఇదే సమయంలో అతని చెల్లి, బావ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఇది చూసి నెటిజన్లు అన్ని బంధాల కంటే అన్నాచెల్లెల్ల అనుబంధం చాలా గొప్పదని కామెంట్లు చేస్తున్నారు.
Wanindu Hasaranga gets emotional during his younger sister getting married.. pic.twitter.com/OuCeQ7wwpy
— Nibraz Ramzan (@nibraz88cricket) August 25, 2023
కాగా, ఇటీవల ముగిసిన లంక ప్రీమియర్ లీగ్‌లో హసరంగ ఆకాశమే హద్దుగా చెలరేగి తన జట్టు బి లవ్ క్యాండీని ఛాంపియన్‌గా నిలిపాడు. టోర్నీ ఆధ్యాంతరం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసిన హసరంగ.. లీడింగ్ రన్ స్కోరర్‌గా (10 మ్యాచ్‌ల్లో 279 పరుగులు), లీడింగ్ వికెట్ టేకర్‌గా (10 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు), అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా (10 మ్యాచ్‌ల్లో 14 సిక్సర్లు) పలు అవార్డులు సొంతం చేసుకుని, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. ఒంటిచేత్తో తన జట్టును ఫైనల్‌కు చేర్చిన హసరంగ.. గాయం కారణంగా ఫైనల్ మ్యాచ్ ఆడలేదు. అయినప్పటికీ బి లవ్ క్యాండీ విజేతగా అవతరించింది.
ఇదిలా ఉంటే, ఆసియా కప్-2023కు ముందు లంక జట్టుకు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. సూపర్ ఫామ్‌లో ఉన్న హసరంగ, దుష్మంత చమీరా గాయాల బారిన పడగా.. స్టార్ ప్లేయర్లు కుశాల్ పెరీరా, ఆవిష్క ఫెర్నాండోలకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఈనెల 30న ప్రారంభమయ్యే ఆసియా కప్ శ్రీలంక, పాక్ వేదికలుగా జరుగనున్న విషయం తెలిసిందే.
ఈ మెగా టోర్నీలో లంకేయులు ఆగస్ట్ 31న తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనున్నారు. పల్లెకెలెలో ఈ మ్యాచ్ జరుగనుంది. మరోవైపు ఇదే టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ సెప్టెంబర్ 2న జరుగనుంది. ఈ మ్యాచ్‌కు కూడా పల్లెకెలె మైదానమే ఆతిథ్యమివ్వనుంది. అనంతరం సెప్టెంబర్ 4 భారత్.. నేపాల్‌తో మ్యాచ్ ఆడనుంది. భారత్, శ్రీలంకలు వేర్వేరు గ్రూప్‌ల్లో ఉండటంతో స్టేజీ-1లో తలపడే అవకాశం రాలేదు.సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్‌తో ఆసియాకప్ ముగుస్తుంది. అనంతరం అక్టోబర్, నవంబర్ నెలల్లో వన్డే వరల్డ్‌కప్ జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment