సన్‌రైజర్స్ ఆటగాళ్లు (PC: BCCI/SRH)
ఐపీఎల్-2024 నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ ఇప్పట్లో జట్టుతో చేరే సూచనలు కనిపించడం లేదు. ఈ శ్రీలంక ఆటగాడు మరికొన్నాళ్లపాటు ఆటకు దూరం కానున్నట్లు సమాచారం. గాయం కారణంగా.. అతడు ఎస్‌ఆర్‌హెచ్ క్యాంపులో చేరడం మరింత ఆలస్యం కానున్నట్లు సమాచారం.
కాగా వనిందు హసరంగ ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లలో లంక తరఫున బరిలోకి దిగాడు. బంగ్లాతో వన్డే, టీ20 మ్యాచ్‌లలో కలిపి మొత్తంగా ఎనిమిది వికెట్లు(6,2) వికెట్లు తీశాడు. అయితే, ఈ సిరీస్ అనంతరం హసరంగ ఎడమకాలి నొప్పి తీవ్రతరం కావడంతో శ్రీలంక క్రికెట్ వైద్య బృందాన్ని సంప్రదించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అతడి గాయం తీవ్రతను గుర్తించిన వైద్యులు.. పరిస్థితి చేయిదాటకముందే తగిన చికిత్స తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఫలితంగా హసరంగ విదేశీ నిపుణుల వద్దకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో కథనం వెల్లడించింది. ఈ క్రమంలో ఇప్పట్లో అతడు సన్‌రైజర్స్ క్యాంపులో చేరే సూచనలు లేవని పేర్కొంది.
హసరంగ
కాగా 2022లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన వనిందు హసరంగ 7.54 ఎకానమీతో 26 వికెట్లు తీశాడు. అయితే, ఐపీఎల్-2024 వేలంలో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ అతడిని రూ. 1.5 కోట్లకు సొంతం చేసుకుంది. 26 ఏళ్ల హసరంగ లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగలడు కూడా!
ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో తమ ఆరంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓటమి ఎదురైన విషయం తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో పరాజయం పాలైంది.
తదుపరి బుధవారం సొంతమైదానం ఉప్పల్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఇందుకోసం ఇప్పటికే ఇరుజట్లు హైదరాబాద్ చేరుకోగా.. విజయం కోసం పట్టుదలగా ఉన్నాయి. కాగా ముంబై ఇండియన్స్ సైతం తమ ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఆరు పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే.
చదవండి: Hyderabad: ఉప్పల్ మ్యాచ్ చూసేందుకు వెళ్తున్నారా? ఇవి తెలుసుకోండి
Comments
Please login to add a commentAdd a comment