వన్డే ప్రపంచకప్-2023కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు సారథిగా దసున్ షనక ఎంపికయ్యాడు. గాయం కారణంగా ఆసియాకప్‌కు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగాకు వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కింది.
అతడితో పాటు మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక కూడా రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే వీరిముగ్గురు తమ ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంది. ఫిట్‌నెస్ ప్రూవ్ చేసుకుంటేనే టోర్నీలో కొనసాగుతారు. అదే విధంగా రిజర్వ్ జాబితాలో దసున్ హేమంత, చమిక కరుణ రత్నేకు ఛాన్స్ లభించింది.
ఇక మెగా టోర్నీలో పాల్గోనేందుకు శ్రీలంక జట్టు గురువారం భారత గడ్డపై అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 29న గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఇక ప్రధాన టోర్నీలో శ్రీలంక తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 7న ఢిల్లీ వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
వరల్డ్‌కప్‌కు శ్రీలంక జట్టు: దసున్ షనక(కెప్టెన్), కుసల్ మెండిస్ (వైస్ కెప్టెన్), పాతుమ్ నిస్సంక, కుసల్ జనిత్, దిముత్ కరుణరత్నే, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వ, సదీర సమరవిక్రమ, దునిత్ వెల్లలగే, కసున్ రజిత, మతీశ పతిరన, లహిరు కుమార, మహేశ్ తీక్షన, వశీన్ తీక్షన మధుశంక ప్రయాణ నిల్వలు: దుషన్ హేమంత, చమిక కరుణరత్నే
Sri Lanka has announced a 15-member squad for the forthcoming ODI World Cup in India.
— CricTracker (@Cricketracker) September 26, 2023
Wanindu Hasaranga, Maheesh Theekshana, and Dilshan Madushanka are currently under scrutiny. pic.twitter.com/PTxmKKqcq4
చదవండి: ABD On Kohli ODI Retirement: 'వన్డే ప్రపంచకప్ తర్వాత కోహ్లి రిటైర్మెంట్'
Comments
Please login to add a commentAdd a comment