బాబర్ ఆజం- వనిందు హసరంగా(PC: ICC)
T20 World Cup 2021- ICC T20 Rankings: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో అద్భుత ప్రదర్శనతో జట్టును ముందుకు నడిపిస్తున్న పాకిస్తాన్ కెప్టెన్, ఓపెనర్ బాబర్ ఆజం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపాడు. ఇంగ్లండ్ బ్యాటర్ డేవిడ్ మలన్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. మొత్తంగా 834 పాయింట్లతో నంబర్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
ఇక మలన్ రెండో స్థానంలో, ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ మూడోస్థానంలో ఉండగా... టీమిండియా తరఫున కెప్టెన్ విరాట్ కోహ్లి(714) ఒక్కడే టాప్-5లో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు.. ఓపెనర్ కేఎల్ రాహుల్(678) ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
వనిందు హసరంగ తొలిసారిగా
బౌలింగ్ విభాగంలో శ్రీలంక ఆటగాడు వనిందు హసరంగ 776 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రేజ్ షంసీ(770)ని వెనక్కి నెట్టి తొలిసారిగా కెరీర్‌లో టాప్ ర్యాంకు సాధించాడు.
ఇక ఇంగ్లండ్ ప్లేయర్ ఆదిల్ రషీద్, అఫ్గనిస్తాన్ స్పిన్నర్లు రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహమాన్ టాప్-5లో ఉన్నారు. అయితే... వరల్డ్‌కప్ టోర్నీలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న దక్షిణాఫ్రికా పేసర్ అన్రిచ్ నోర్ట్జే ఏకంగా 18 స్థానాలు ఎగబాకి ఏడో స్థానానికి చేరుకున్నాడు.
ఆసియా దేశాల క్రికెటర్ల హవా
అదే విధంగా ఆల్‌రౌండర్ల విభాగంలో బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్, అఫ్గన్ కెప్టెన్ మహ్మద్ నబీ 271 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. హసరంగ నాలుగో స్థానంలో ఉన్నాడు. కాగా ఐసీసీ టీ20 తాజా ర్యాంకింగ్స్‌లో ఆసియా దేశాల ఆటగాళ్లు అన్ని విభాగాల్లోనూ టాప్-10లో నిలవడం విశేషం. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, కోహ్లి, రాహుల్, వనిందు హసరంగ, రషీద్ ఖాన్, నబీ, షకీబ్ అల్ హసన్ సత్తా చాటారు.
చదవండి: Virat Kohli- Rohit Sharma: కోహ్లిపై రోహిత్, అశ్విన్ ప్రశంసల వర్షం; అస్సలు ఊహించలేదన్న విరాట్
Babar Azam is the new No.1 batter on the @MRFWorldwide ICC Men’s T20I rankings, while Wanindu Hasaranga has claimed top spot on the bowling rankings for the first time 👏#T20WorldCup pic.twitter.com/zoCVVJIPze
— ICC (@ICC) November 3, 2021
Comments
Please login to add a commentAdd a comment