లంకప్రీమియర్ లీగ్-2023 ఫైనల్లో బీ-లవ్ కాండీ అడుగుపెట్టింది. కొలాంబో వేదికగా గాలే టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్ 2లో 34 పరుగుల తేడాతో విజయం సాధించిన బీ-లవ్ కాండీ.. తమ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో బీ-లవ్ కాండీ కెప్టెన్ వనిందు హసరంగా ఆల్‌రౌండ్ షో తో అదరగొట్టాడు. తొలుత బ్యాటింగ్‌లో 48 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన హసరంగా.. అనంతరం బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టి తమ జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన కాండీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. కాండీ బ్యాటర్లలో హసరంగాతో పాటు చండీమాల్(38) పరుగులతో రాణించాడు. గాలే బౌలర్లలో కుమారా, దినుష్క తలా రెండు వికెట్లు పడగొట్టగా.. షకీబ్, రజితా ఒక్క వికెట్ సాధించారు. అనంతరం 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గాలే.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 123 పరుగులు మాత్రమే చేయగల్గింది.
గాలే బ్యాటర్లలో లిటన్ దాస్(25), దినుష్క(28) మినహా మిగితా అందరూ విఫలమయ్యారు. కాండీ బౌలర్లలో హసరంగా, హస్నేన్, డి సిల్వా తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఆదివారం కొలాంబో వేదికగా జరగనున్న ఫైనల్లో దంబుల్లా ఔరాతో కాండీ అమీతుమీ తెల్చుకోనుంది.
చదవండి: Asia Cup: హార్దిక్ పాండ్యాకు బిగ్‌షాక్.. టీమిండియా కొత్త వైస్ కెప్టెన్ అతడే!
Comments
Please login to add a commentAdd a comment