
పల్లెకెలె వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో 155 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో లంక సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 308 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
లంక బ్యాటర్లలో అసలంక 97 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కుశాల్ మెండిస్(61), సమరవిక్రమ(52), జనిత్ లియాంగే(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో ఓమర్జాయ్ 3 వికెట్లు, నూర్ అహ్మద్, క్వైస్ అహ్మద్ తలా వికెట్ సాధించారు.
అనంతరం 309 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్.. 33.5 ఓవర్లలో 153 పరుగులకే కుప్పకూలింది. అఫ్గాన్ బ్యాటర్లలో ఇబ్రహీం జద్రాన్(54), రెహమత్ షా(63) పరుగులతో పర్వాలేదన్పించారు. మిగితా బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. శ్రీలంక బౌలర్లలో వనిందు హసరంగా 4 వికెట్లతో చెలరేగగా.. అసిత్ ఫెర్నాండో, మధుశంక తలా రెండు వికెట్లు పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment