
Ind Vs Sl T20 Series: టీమిండియాతో సిరీస్.. శ్రీలంకకు భారీ షాక్.. కీలక ఆటగాడు దూరం!
India Vs Sri Lanka T20 Series: టీమిండియాతో టీ20 సిరీస్ ఆరంభానికి ముందు శ్రీలంకకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగ జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన అతడు ఇంకా కోలుకోకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. భారత్‌తో సిరీస్ నేపథ్యంలో నిర్వహించిన ఆర్‌టీ- పీసీఆర్ పరీక్షలో హసరంగకు మరోసారి కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం.
ఈ క్రమంలో టీ20 సిరీస్‌కు అతడు దూరమయ్యాడు. టెస్టు సిరీస్‌కు కూడా హసరంగ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. దీంతో లంకకు భారీ షాక్ తగిలినట్లయింది. కాగా ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన సమయంలో హసరంగకు కరోనా సోకింది. అతడితో పాటు కుశాల్ మెండిస్, బినుర ఫెర్నాండో కూడా వైరస్ బారిన పడ్డారు. ఈ క్రమంలో వీరు ముగ్గురు పలు మ్యాచ్‌లకు దూరమయ్యారు.
ఇక ఆస్ట్రేలియా గడ్డ మీద లంకకు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. 1-4 తేడాతో టీ20 సిరీస్‌ను కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియాతో ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానున్న పొట్టి ఫార్మాట్ సిరీస్‌కు సన్నద్ధమవుతోంది. ఇదిలా ఉంటే... మంచి ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ సహా దీపక్ చహర్ గాయాల కారణంగా టీమిండియాకు దూరమయ్యారు. కాగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, రెండు టెస్టులు ఆడేందుకు లంక జట్టు భారత్‌లో పర్యటించనుంది.
చదవండి: Rohit-Ritika Sajdeh: రోహిత్ నన్ను పట్టించుకో.. ప్లీజ్ ఒకసారి ఫోన్ చేయ్: రితికా శర్మ