గంభీర్- సూర్య (PC: BCCI)
టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్‌కు ఘనమైన ఆరంభం లభించింది. అతడి మార్గదర్శనంలోని టీమిండియా శ్రీలంకతో టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. లంక పర్యటనలో భాగంగా మూడు టీ20లలోనూ గెలుపొంది మరోసారి తమ స్థాయిని చాటుకుంది. ఈ నేపథ్యంలో జట్టును ఉద్దేశించి గంభీర్ ప్రసంగించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
‘‘అద్భుతమైన విజయం ఇది. సిరీస్ గెలిచినందుకు మీ అందరికీ అభినందనలు. అత్యద్భుతమైన కెప్టెన్సీతో జట్టుకు విజయం అందించిన సూర్యకు శుభాకాంక్షలు. బ్యాటర్‌గానూ అతడు అద్భుత ప్రదర్శన కనబరిచాడు. సిరీస్ ఆరంభానికి ముందు నేను ఏం కోరుకుంటున్నానో మీకు చెప్పాను.
అయితే, మీరు అంతకంటే ఎక్కువే సాధించారు. అయితే, ఇలాంటి వికెట్లపై రాణించాలంటే మన నైపుణ్యాలకు మరింత పదును పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. పిచ్ స్వభావం, ఎంత మేర స్కోరు చేయవచ్చో ముందుగానే అంచనా వేస్తున్నాం. అయితే, కొన్నిసార్లు అంచనాలు తప్పవచ్చు. ఈ మ్యాచ్ ద్వారా మనమెన్నో కొత్త పాఠాలు నేర్చుకున్నాం. సిరీస్ గెలుపు కంటే కూడా ఇదే గొప్ప విషయం’’ అని గౌతం గంభీర్ టీమిండియాను ఉద్దేశించి స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు చేశాడు. కాగా మంగళవారం నాటి మూడో టీ20లో భారత జట్టు బ్యాటింగ్ చెత్తగా సాగింది.
నిర్ణీత 20 ఓవర్లలో 137 పరుగుల నామమాత్రపు స్కోరుకు పరిమితమైంది. ఈ క్రమంలో ఆతిథ్య లంక గట్టిపోటీనివ్వడంతో టీమిండియా ఓటమి దాదాపుగా ఖరారైంది. అయితే, భారత బౌలర్ల కారణంగా మ్యాచ్ టై అవడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ క్రమంలో టీమిండియా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ సూపర్ ఓవర్ వేయగా.. శ్రీలంక 3 బంతులాడి 2 వికెట్లు కోల్పోయి 2 పరుగులే చేసింది. ఇక 3 పరుగుల లక్ష్యాన్ని భారత్ తొలి బంతికే బౌండరీ బాది ఛేదించింది.
𝗧𝗵𝗶𝘀 𝗧𝗲𝗮𝗺 💙
Head Coach Gautam Gambhir 🤝 Hardik Pandya address the dressing room as the action now shifts to the ODIs in Colombo #TeamIndia | #SLvIND | @GautamGambhir | @hardikpandya7 pic.twitter.com/PFrTEVzdvd— BCCI (@BCCI) July 31, 2024
Comments
Please login to add a commentAdd a comment