అంతర్జాతీయ టీ20ల్లో డబుల్ హ్యాట్రిక్ నమోదైంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ సబ్ రీజియనల్ అమెరికా క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా కేమెన్ ఐలాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా పేస్ బౌలర్ హెర్నన్ ఫెన్నెల్ ఈ ఫీట్ సాధించాడు.
ఫెన్నెల్.. కేమెన్ ఐలాండ్స్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో డబుల్ హ్యాట్రిక్ నమోదు చేసిన ఆరో బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
ఫెన్నెల్‌కు ముందు రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్తాన్) vs ఐర్లాండ్, 2019
లసిత్ మలింగ (శ్రీలంక) vs న్యూజిలాండ్, 2019
కర్టిస్ కాంఫర్ (ఐర్లాండ్) vs నెదర్లాండ్స్, 2021
జాసన్ హోల్డర్ (వెస్టిండీస్) vs ఇంగ్లాండ్, 2022
వసీమ్ యాకూబ్ర్ (లెసోతో) vs మాలి, 2024 ఈ ఘనత సాధించారు.
కేమెన్ ఐలాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫెన్నెల్ డబుల్ హ్యాట్రిక్ సహా మొత్తం ఐదు వికెట్లు (5/14) తీశాడు. ట్రాయ్ టేలర్, అలిస్టర్ ఐఫిల్, రొనాల్డ్ ఈబ్యాంక్స్, అలెస్సాండ్రో మోరిస్ ఫెన్నెల్ డబుల్ హ్యాట్రిక్ బాధితులు.
అంతర్జాతీయ టీ20ల్లో ఫెన్నెల్‌కు ఇది రెండో హ్యాట్రిక్ కావడం మరో విశేషం. 36 ఏళ్ల ఫెన్నెల్ 2021లో పనామాతో జరిగిన మ్యాచ్‌లో తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఫెన్నెల్.. అంతర్జాతీయ టీ20ల్లో రెండు అంతకంటే ఎక్కువ హ్యాట్రిక్‌లు నమోదు చేసిన ఆరో బౌలర్‌గానూ రికార్డుల్లోకెక్కాడు.
ఫెన్నెల్‌కు ముందు మాల్టాకు చెందిన వసీం అబ్బాస్,
ఆస్ట్రేలియాకు చెందిన పాట్ కమిన్స్
సెర్బియాకు చెందిన మార్క్ పావ్లోవిక్
న్యూజిలాండ్‌కు చెందిన టిమ్ సౌథీ
శ్రీలంకకు చెందిన లసిత్ మలింగ అంతర్జాతీయ టీ20ల్లో రెండు అంతకంటే ఎక్కువ హ్యాట్రిక్‌లు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment