Double hat-trick
-
అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన ఘనత.. డబుల్ హ్యాట్రిక్
అంతర్జాతీయ టీ20ల్లో డబుల్ హ్యాట్రిక్ నమోదైంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ సబ్ రీజియనల్ అమెరికా క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా కేమెన్ ఐలాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా పేస్ బౌలర్ హెర్నన్ ఫెన్నెల్ ఈ ఫీట్ సాధించాడు. ఫెన్నెల్.. కేమెన్ ఐలాండ్స్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో డబుల్ హ్యాట్రిక్ నమోదు చేసిన ఆరో బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.ఫెన్నెల్‌కు ముందు రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్తాన్) vs ఐర్లాండ్, 2019లసిత్ మలింగ (శ్రీలంక) vs న్యూజిలాండ్, 2019కర్టిస్ కాంఫర్ (ఐర్లాండ్) vs నెదర్లాండ్స్, 2021జాసన్ హోల్డర్ (వెస్టిండీస్) vs ఇంగ్లాండ్, 2022వసీమ్ యాకూబ్ర్ (లెసోతో) vs మాలి, 2024 ఈ ఘనత సాధించారు.కేమెన్ ఐలాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫెన్నెల్ డబుల్ హ్యాట్రిక్ సహా మొత్తం ఐదు వికెట్లు (5/14) తీశాడు. ట్రాయ్ టేలర్, అలిస్టర్ ఐఫిల్, రొనాల్డ్ ఈబ్యాంక్స్, అలెస్సాండ్రో మోరిస్ ఫెన్నెల్ డబుల్ హ్యాట్రిక్ బాధితులు.అంతర్జాతీయ టీ20ల్లో ఫెన్నెల్‌కు ఇది రెండో హ్యాట్రిక్ కావడం మరో విశేషం. 36 ఏళ్ల ఫెన్నెల్ 2021లో పనామాతో జరిగిన మ్యాచ్‌లో తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఫెన్నెల్.. అంతర్జాతీయ టీ20ల్లో రెండు అంతకంటే ఎక్కువ హ్యాట్రిక్‌లు నమోదు చేసిన ఆరో బౌలర్‌గానూ రికార్డుల్లోకెక్కాడు.ఫెన్నెల్‌కు ముందు మాల్టాకు చెందిన వసీం అబ్బాస్,ఆస్ట్రేలియాకు చెందిన పాట్ కమిన్స్సెర్బియాకు చెందిన మార్క్ పావ్లోవిక్న్యూజిలాండ్కు చెందిన టిమ్ సౌథీశ్రీలంకకు చెందిన లసిత్ మలింగ అంతర్జాతీయ టీ20ల్లో రెండు అంతకంటే ఎక్కువ హ్యాట్రిక్‌లు నమోదు చేశారు. -
డబుల్ హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించిన బౌలర్
బిగ్‌బాష్ లీగ్‌లో(బీబీఎల్) అద్భుత ఘటన చోటుచేసుకుంది. మెల్బోర్న్ రెనెగేడ్స్ లెగ్ స్పిన్నర్ కామెరాన్ బోయ్స్ డబుల్ హ్యాట్రిక్‌తో మెరిశాడు. బీబీఎల్‌లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించిన బోయ్స్.. ఓవరాల్‌గా టి20 క్రికెట్లో డబుల్ హ్యాట్రిక్ సాధించిన 10వ క్రికెటర్‌గా నిలిచాడు. సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఏడో ఓవర్ ఆఖరి బంతికి అలెక్స్ హేల్స్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్ వేసిన బోయ్స్ వరుస మూడు బంతుల్లో జాసన్ సంఘా, అలెక్స్ రాస్, డేనియల్ సామ్స్‌లను వెనక్కి పంపాడు. చదవండి: వికెట్ తీసి వింత సెలబ్రేషన్‌తో మెరిసిన బౌలర్ అలా నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీసి రికార్డు అందుకున్నాడు. అయితే అలెక్స్ రోస్‌ను ఔట్ చేయడం ద్వారా హ్యాట్రిక్ సాధించిన బోయ్స్.. బీబీఎల్ ఈ ఘనత సాధించిన ఎనిమిదో బౌలర్‌గా నిలిచాడు. ఆ తర్వాత బంతికే మరో వికెట్ తీసి డబుల్ హ్యాట్రిక్ సాధించాడు. ఇక తాను వేసిన మూడో ఓవర్లో మరో వికెట్ తీసిన బోయ్స్.. ఓవరాల్‌గా నాలుగు ఓవర్లలో 21 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డబుల్ హ్యాట్రిక్ అంటే.. సాధారణంగా హ్యాట్రిక్ అంటే మూడు వరుస బంతుల్లో మూడు వికెట్లు తీయడం అని అందరికి తెలుసు. ఇక డబుల్ హ్యాట్రిక్ అంటే వరుసగా ఆరు వికెట్లు తీయడమని క్రికెట్ భాషలో అర్థం. కానీ ఆస్ట్రేలియా క్రికెట్లో మాత్రం.. నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీయడాన్ని డబుల్ హ్యాట్రిక్ పేరుతో పిలుస్తున్నారు. ఒక ఓవర్ చివరి బంతికి వికెట్.. తర్వాతి ఓవర్లో వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు.. ఓవరాల్‌గా 1,2,3.. లేదా 2,3,4 వికెట్లను డబుల్ హ్యాట్రిక్‌గా కౌంట్ చేయడం అక్కడ ఆనవాయితీ. ఇక ఐదు వరుస బంతుల్లో ఐదు వికెట్లు తీస్తే దానిని ట్రిపుల్ హ్యాట్రిక్ అని పేర్కొంటారు. చదవండి: విండీస్ ప్లేయర్ "సూపర్ మ్యాన్ క్యాచ్"కు సలాం కొడుతున్న నెటిజన్లు We still can't believe this happened!! A double hattie from Cameron Boyce!! #BBL11 pic.twitter.com/fQWsFakSnx — KFC Big Bash League (@BBL) January 19, 2022 -
క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒకే ఓవర్లో ఆరు వికెట్లు
దుబాయ్: క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. దుబాయ్ వేదికగా జరిగిన కర్వాన్ అండర్-19 గ్లోబల్ లీగ్ టీ20 టోర్నీలో భారత సంతతి(ఢిల్లీ)కి చెందిన స్థానిక కుర్రాడు హర్షిత్ సేథ్ ఒకే ఓవర్లో ఆరు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. పాకిస్థాన్‌కు చెందిన హైదరాబాద్ హాక్స్ అకాడమీ ఆర్సీజీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో దుబాయ్ క్రికెట్ కౌన్సిల్ స్టార్లెట్స్కు ప్రాతినిధ్యం వహించిన హర్షిత్.. డబుల్ హ్యాట్రిక్ సహా మొత్తం 8 వికెట్లు(4-0-4-8) సాధించడంతో పర్యాటక జట్టు 44 పరుగులకే కుప్పకూలింది. ప్రస్తుత క్రికెట్లో దాదాపుగా అసాధ్యమైన డబుల్ ఈ హ్యాట్రిక్ ఫీట్‌ను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హర్షిత్ సాధించాడు. ఈ ఏడాది నవంబర్ 28న జరిగిన ఈ ఘట్టం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘట్టం ఇంతవరకు ఆవిష్కృతం కాలేదు. అయితే, 2017 జనవరిలో ఆస్ట్రేలియా క్లబ్ క్రికెట్లో ఇలాంటి ఘట్టమే ఆవిష్కృతమైంది. గోల్డన్ పాయింట్ క్రికెట్ క్లబ్ తరఫున అలెడ్ క్యారీ డబుల్ హ్యాట్రిక్ సాధించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అంతకుముందు 1930లో భారత స్కూల్ క్రికెట్లో వైఎస్ రామస్వామి, 1951లో ఇంగ్లండ్ లోకల్ క్రికెట్లో జి సిరెట్ ఈ రికార్డును సాధించినట్లు తెలుస్తోంది. చదవండి: ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌కు కీలక పదవి.. -
శ్రుతి డబుల్ హ్యాట్రిక్
ఇవాళ ఒక్క హిట్టే గగనంగా మారుతుంటే, హిట్ తరువాత హిట్ సాధించడం అన్నది సాధారణ విషయం కాదు.అలా హ్యాట్రిక్ సొంతం చేసుకోవడం విశేషం అవుతుంది. ఇక నటి శ్రుతీహాసన్ విషయానికొస్తే ఈ బ్యూటీ విజయపరంపర కొనసాగుతోంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో క్రేజీ నాయకిగా రాణిస్తున్న శ్రుతి ఒక్క తెలుగు భాషలోనే వరుసగా డబుల్ హ్యాట్రిక్ సాధించిన హీరోయిన్గా రికార్డు సాధించారు. ఇటీవల ప్రేమమ్, సింగం–3, ఇటీవల విడుదలైన కాటమరాయుడు చిత్రాలతో రెండవ హ్యాట్రిక్‌ను సొంతం చేసుకున్నారు. గ్లామర్‌తో పాటు ఫెర్ఫార్మెన్స్ నటిగా పేరు తెచ్చుకుంటున్న శ్రుతీహాసన్‌కు తెలుగులో తొలి విజయాన్ని పవన్‌కల్యాణ్‌కు జంటగా నటించిన గబ్బర్‌సింగ్ చిత్రంతో అందుకున్నారు. ఆ తరువాత ఈ అమ్మడికి కేరీర్ పరంగా వెనుక తిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. రెండవ సారి పవన్‌కల్యాణ్‌తో నటించిన కాటమరాయుడు చిత్రం శుక్రవారం విడుదలై విశేష ప్రేక్షకాదరణతో దూసుకుపోతోందని శ్రుతీ వర్గాలు పేర్కొన్నారు. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు లభిస్తున్నాయని, శ్రుతీహసన్ 2017 సాధించిన రెండవ విజయం ఇదని పేర్కొన్నారు. శ్రుతీహాసన్ బహుభాషా నటి కావడంతో దక్షిణాదిలో నటించిన చిత్రాలు హిందీలోనూ మంచి వసూళ్లను రాబడుతున్నాయని, అదే విధంగా హిందీ చిత్రాలు దక్షిణాదిలోనే సక్సెస్ అవుతున్నాయని అంటున్నారు. ఇప్పటికే సౌత్ బాక్సాఫీస్ హీరోయిన్గా ఎదిగిన శ్రుతీ తదుపరి సంఘమిత్ర అనే భారీ త్రిభాషా చిత్రంలో నటించనున్నారని తెలిపారు. సుందర్.సీ దర్శకత్వం వహిస్తున్న ఇందులో జయంరవి, ఆర్య కథానాయకులుగా నటించడానికి రెడీ అవుతున్నారన్నది గమనార్హం. ఈ చిత్రం తన కేరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయాన్ని శ్రుతీహాసన్ వర్గాలు వ్యక్తం చేస్తున్నారు.