శ్రుతి డబుల్‌ హ్యాట్రిక్‌ | shruti hassan Double hat-trick | Sakshi
Sakshi News home page

శ్రుతి డబుల్‌ హ్యాట్రిక్‌

Published Sun, Mar 26 2017 2:47 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

శ్రుతి డబుల్‌ హ్యాట్రిక్‌ - Sakshi

శ్రుతి డబుల్‌ హ్యాట్రిక్‌

ఇవాళ ఒక్క హిట్టే గగనంగా మారుతుంటే, హిట్‌ తరువాత హిట్‌ సాధించడం అన్నది సాధారణ విషయం కాదు.అలా హ్యాట్రిక్‌ సొంతం చేసుకోవడం విశేషం అవుతుంది. ఇక నటి శ్రుతీహాసన్‌ విషయానికొస్తే ఈ బ్యూటీ విజయపరంపర కొనసాగుతోంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో క్రేజీ నాయకిగా రాణిస్తున్న శ్రుతి ఒక్క తెలుగు భాషలోనే వరుసగా డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించిన హీరోయిన్‌గా రికార్డు సాధించారు. ఇటీవల ప్రేమమ్, సింగం–3, ఇటీవల విడుదలైన కాటమరాయుడు చిత్రాలతో రెండవ హ్యాట్రిక్‌ను సొంతం చేసుకున్నారు.

గ్లామర్‌తో పాటు ఫెర్ఫార్మెన్స్‌ నటిగా పేరు తెచ్చుకుంటున్న శ్రుతీహాసన్‌కు తెలుగులో తొలి విజయాన్ని పవన్‌కల్యాణ్‌కు జంటగా నటించిన గబ్బర్‌సింగ్‌ చిత్రంతో అందుకున్నారు. ఆ తరువాత ఈ అమ్మడికి కేరీర్‌ పరంగా వెనుక తిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. రెండవ సారి పవన్‌కల్యాణ్‌తో నటించిన కాటమరాయుడు చిత్రం శుక్రవారం విడుదలై విశేష ప్రేక్షకాదరణతో దూసుకుపోతోందని శ్రుతీ వర్గాలు పేర్కొన్నారు.

 ఇందులో ఆమె నటనకు ప్రశంసలు లభిస్తున్నాయని, శ్రుతీహసన్‌ 2017 సాధించిన రెండవ విజయం ఇదని పేర్కొన్నారు. శ్రుతీహాసన్‌ బహుభాషా నటి కావడంతో దక్షిణాదిలో నటించిన చిత్రాలు హిందీలోనూ మంచి వసూళ్లను రాబడుతున్నాయని, అదే విధంగా హిందీ చిత్రాలు దక్షిణాదిలోనే సక్సెస్‌ అవుతున్నాయని అంటున్నారు.

 ఇప్పటికే సౌత్‌ బాక్సాఫీస్‌ హీరోయిన్‌గా ఎదిగిన శ్రుతీ తదుపరి సంఘమిత్ర అనే భారీ త్రిభాషా చిత్రంలో నటించనున్నారని తెలిపారు. సుందర్‌.సీ దర్శకత్వం వహిస్తున్న ఇందులో జయంరవి, ఆర్య కథానాయకులుగా నటించడానికి రెడీ అవుతున్నారన్నది గమనార్హం. ఈ చిత్రం తన కేరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయాన్ని శ్రుతీహాసన్‌ వర్గాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement