
ఫుట్‌బాల్ ప్రపంచకప్‌నకు ముందు అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ప్రత్యర్థులకు హెచ్చరిక పంపాడు. హైతీతో బుధవారం జరిగిన సన్నాహక మ్యాచ్‌లో అతను హ్యాట్రిక్ కొట్టాడు. మ్యాచ్ 17వ నిమిషంలోనే తొలి గోల్ చేసిన ఈ అర్జెంటీనా స్టార్... రెండో భాగంలో 10 నిమిషాల (58 ని., 68 ని.) వ్యవధిలోనే రెండు గోల్స్ చేశాడు.
అగ్యురో 69వ నిమిషంలో మరో గోల్ సాధించడంతో అర్జెంటీనా 4–0 తేడాతో హైతీని ఓడించింది. తన 124వ అంతర్జాతీయ మ్యాచ్‌లో 64వ గోల్ చేసిన మెస్సీ ఈసారి అర్జెంటీనా ప్రపంచకప్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment