ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్ 2024 ఎడిషన్‌లో కెంట్ బౌలర్, ఇంగ్లండ్ లెగ్ స్పిన్ బౌలర్ మాథ్యూ పార్కిన్సన్ అదిరిపోయే హ్యాట్రిక్ సాధించాడు. మిడిల్‌సెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 4 ఓవర్లలో హ్యాట్రిక్‌తో కలుపుకుని 4 వికెట్లు పడగొట్టాడు. పార్కిన్సన్ ధాటికి భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న మిడిల్‌సెక్స్ 107 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా కెంట్ 98 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కెంట్.. జో డెన్లీ (56), బెల్ డ్రమ్మండ్ (38) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది.హాల్‌మెన్ (3/27), బ్లేక్ కల్లెన్ (3/47), టామ్ హెల్మ్ (2/37) బంతితో రాణించారు.
A hat-trick for Matt Parkinson! 🤩 pic.twitter.com/RoIcNZgH9X
— Vitality Blast (@VitalityBlast) May 31, 2024
అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మిడిల్‌సెక్స్ పార్కిన్సన్, మార్కస్ (2/28), గ్రాంట్ స్టివార్ట్ (2/22), స్వేన్‌పోయెల్ (1/11), బార్లెట్ (1/16) ధాటికి 14.1 ఓవర్లలోనే చాపచుట్టేసింది. మిడిల్‌సెక్స్ ఇన్నింగ్స్‌లో హాల్‌మెన్, ఎస్కినాజీ, జాక్ డేవిస్ తలో 23 పరుగులు చేయగా.. మిగతా వారంతా విఫలమయ్యారు. కాగా. టీ20 బ్లాస్ట్ టోర్నీ మే 30వ తేదీ నుంచి మొదలయ్యింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇవాళ మరో రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి.
ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ తరఫున ఒక టెస్ట్, 5 వన్డేలు, 6 టీ20లు ఆడిన మాట్ పార్కిన్సన్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో 12 మ్యాచ్‌ల్లో కేవలం 13 వికెట్లు మాత్రమే తీసిన పార్కిన్సన్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 60 మ్యాచ్‌ల్లో 191 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లోనూ పార్కిన్సన్ ఓ మోస్తరు ప్రదర్శనలు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతను 37 మ్యాచ్‌లు ఆడి 64 వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌తో పాటు దేశీయంగా జరిగే పలు టీ20 టోర్నీల్లో పాల్గొనే పార్కిన్సన్.. ఇప్పటివరకు 104 మ్యాచ్‌లు ఆడి 143 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment