రెండు సీట్లు రాని బీజేపీ బీసీని సీఎంను చేస్తుందా? | Telangana Assembly Elections 2023: BRS Minister Talasani Srinivas Yadav Serious Comments On BJP - Sakshi
Sakshi News home page

రెండు సీట్లు రాని బీజేపీ బీసీని సీఎంను చేస్తుందా?

Published Sat, Nov 4 2023 4:53 AM | Last Updated on Sat, Nov 4 2023 12:28 PM

Minister Talasani Srinivas Yadav Serious Comments on BJP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గత ఎన్నికల్లో రెండు సీట్లు కూడా గెలవని బీజేపీ.. ఇప్పుడు బీసీలకు సీఎం పదవి అనడం హాస్యాస్పదమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఎద్దేవా చేశారు. ఏదైనా చెప్పేముందు దానిలో వాస్తవికత ఉండాలని అన్నారు. సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తామన డం కొందరికి ఫ్యాషన్‌గా మారిందని విమర్శించారు.

శుక్రవారం హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ‘మీట్‌ ది ప్రెస్‌’కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాము ఏ పార్టీకీ బీ టీమ్‌ కాదని తలసాని స్పష్టం చేశారు. తమది ఏ టీమ్‌ అని, సింగిల్‌ గానే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందన్నారు. బీఆర్‌ఎస్‌కు తగినన్ని సీట్లు రావనే ప్రశ్నే ఉత్పన్నం కాదని, 78 సీట్లతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్‌ కొట్టబోతున్నామని చెప్పారు.  కేంద్రంలోనూ కీలక భూమిక పోషిస్తామని తెలిపారు.  

కాంగ్రెస్‌ పార్టీకి అభ్యర్థులు లేరు! 
పోటీ చేసేందుకు తగిన అభ్యర్థులు కాంగ్రెస్‌ పార్టీకి లేరని తలసాని విమర్శించారు. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన 27 మందికి సీట్లివ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి వెళ్లిపోయిన వారికి వెంటనే సీట్లు ఇస్తోందన్నారు. బల్దియా ఎన్నికల్లో ఎక్కువ మంది బీజేపీ కార్పొరేటర్లు గెలిచినప్పటికీ ఇప్పుడా పరిస్థితి లేదని చెప్పారు. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్రం మహిళా రిజర్వేషన్‌ బిల్లును తెరపైకి తేవడం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆడిన డ్రామా అని విమర్శించారు.

తాము అమలు చేస్తు న్న పథకాలను దేశమే కాపీ కొడుతోందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ ప్రజలు ఓటువేసే హక్కును ఉపయోగించుకోవాలని, ఓట్లు వేయరనే అపప్రదను చెరిపి వేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో టీడీపీ పోటీ చేయకపోవడం, చంద్రబాబు అరెస్టు, తదితర పరిణామాల ప్రభావం ఇక్కడ ఏమాత్రం ఉండదని స్పష్టం చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యల్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే పరిష్కరిస్తుందంటూ, తమ(ఎమ్మెల్యేల)ఇళ్ల స్థలా లు కూడా ఆగిపోయాయని వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement