మోంజా (ఇటలీ): వేదిక మారినా... ట్రాక్ ఏదైనా... తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ... రయ్ రయ్‌మంటూ దూసుకెళ్తున్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్‌లో ఆరోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 18.887 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. తద్వారా ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో ఆస్ట్రియా, హంగేరి, బ్రిటిష్ గ్రాండ్‌ప్రిలలో వరుసగా... మళ్లీ స్పెయిన్, బెల్జియం, ఇటలీ గ్రాండ్‌ప్రిలలో వరుసగా హామిల్టన్‌కు ‘పోల్ పొజిషన్’ దక్కడం విశేషం. ఓవరాల్‌గా హామిల్టన్ కెరీర్‌లో ఇది 94వ పోల్ పొజిషన్. మెర్సిడెస్‌కే చెందిన బొటాస్ రెండో స్థానం నుంచి, మెక్‌లారెన్ డ్రైవర్ కార్లోస్ సెయింజ్ మూడో స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. ఫెరారీ జట్టు డ్రైవర్లు 1984 తర్వాత తొలిసారి సొంతగడ్డపై టాప్–10లో లేకుండా రేసును ప్రారంభించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment