
ఉమేశ్ హ్యాట్రిక్ రంజీ ట్రోఫీ
నాగపూర్: దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో భారత తుది జట్టులో చోటు దక్కని పేస్ బౌలర్ ఉమేశ్ యాదవ్ రంజీ ట్రోఫీలో రాజస్తాన్ జట్టుపై చెలరేగాడు. ఉమేశ్ ఈ ఇన్నింగ్స్‌లో హ్యాట్రిక్ సాధించడం విశేషం. తన 18వ ఓవర్లో అతను వరుస బంతుల్లో అజయ్, అనికేత్, నాథు సింగ్‌లను అవుట్ చేశాడు.
ఉమేశ్ (4/45) బౌలింగ్ ధాటికి రాజస్థాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 216 పరుగులకే ఆలౌటైంది. కాన్పూర్‌లో తమిళనాడుతో జరుగుతున్న మరో రంజీ మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ 4 వికెట్లకు 277 పరుగులు చేసింది. సురేశ్ రైనా (56 బంతుల్లో 52 బ్యాటింగ్; 8 ఫోర్లు) నిలకడగా ఆడుతున్నాడు.