సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఒకే రోజు రెండు హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి. ఇవాళ (నవంబర్ 5) జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉత్తర్ ప్రదేశ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తొలి హ్యాట్రిక్ నమోదు చేయగా.. నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గోవా బౌలర్ ఫెలిక్స్ అలెమావో రెండో హ్యాట్రిక్ నమోదు చేశాడు.
భువీ ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీశాడు. ఈ ఓవర్‌లో భువీ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లో భువీ మొత్తంగా 4 ఓవర్లు వేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇందులో ఓ మెయిడిన్ ఉంది. ఈ మ్యాచ్‌లో భువీతో పాటు మిగతా బౌలర్లు కూడా చెలరేగడంతో జార్ఖండ్‌పై యూపీ 10 పరుగుల తేడాతో గెలుపొందింది.
రెండో హ్యాట్రిక్ విషయానికొస్తే.. నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గోవా బౌలర్ ఫెలిక్స్ అలెమావో ఇన్నింగ్స్ చివరి మూడు బంతులకు మూడు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో ఫెలిక్స్ మొత్తంగా 5 వికెట్లు తీశాడు. ఫెలిక్స్‌తో పాటు మోహిత్ రేడ్కర్ (4/18) కూడా చెలరేగడంతో నాగాలాండ్‌పై గోవా 108 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గోవా.. దర్శన్ మిసాల్ (91), సూయాశ్ ప్రభుదేశాయ్ (69) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన నాగాలాండ్ నిర్ణీత ఓవర్లలో 129 పరుగులకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. నాగాలాండ్ ఇన్నింగ్స్‌లో చేతన్ బిస్త్ (63) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.
Comments
Please login to add a commentAdd a comment