రాణించిన నితీశ్‌ రాణా.. చెలరేగిన భువనేశ్వర్‌ కుమార్‌ | SMAT 2023: Bhuvi, Nitish Rana Shines Uttar Pradesh Beat Gujarat In Pre Quarters 1 | Sakshi
Sakshi News home page

SMAT 2023: రాణించిన నితీశ్‌ రాణా.. చెలరేగిన భువనేశ్వర్‌ కుమార్‌

Published Wed, Nov 1 2023 11:42 AM | Last Updated on Wed, Nov 1 2023 11:49 AM

SMAT 2023: Bhuvi, Nitish Rana Shines As Uttar Pradesh Beat Gujarat In Pre Quarters 1 - Sakshi

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ 2023లో టీమిండియా క్రికెటర్లు భువనేశ్వర్‌ కుమార్‌, నితీశ్‌ రాణా సత్తా చాటారు. నిన్న గుజరాత్‌తో జరిగిన ప్రీక్వార్టర్‌ఫైనల్‌-1లో ఈ ఇద్దరు ఉత్తర్‌ప్రదేశ్‌ ఆటగాళ్లు ఆయా విభాగాల్లో రాణించారు. తొలుత బౌలింగ్‌లో భువీ.. ఆతర్వాత బ్యాటింగ్‌లో రాణా చెలరేగారు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ను భువనేశ్వర్‌ కుమార్‌ (4-0-21-3) దారుణంగా దెబ్బకొట్టాడు. భువీతో పాటు మోహిసిన్‌ ఖాన్‌ (4-0-13-2), నితీశ్‌ రాణా (1-0-9-1), ధన్‌కర్‌ (3-0-21-1), కార్తీక్‌ త్యాగి (4-0-27-1) రాణించడంతో గుజరాత్‌ 127 పరుగులకు (20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) పరిమితమైంది. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో సౌరవ్‌ చౌహాన్‌ (32) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూపీ.. రాణా (49 బంతుల్లో 71 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. రాణాతో పాటు సమీర్‌ రిజ్వి (30) రాణించాడు. గుజరాత్‌ బౌలర్లలో రవి బిష్ణోయ్‌ 2 వికెట్లు పడగొట్టగా.. చింతన్‌ గజా, హేమంగ్‌ పటేల్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

నిన్ననే జరిగిన క్వార్టర్‌ఫైనల్‌-2లో బెంగాల్‌పై అస్సాం 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. నవంబర్‌ 2న మరో రెండు ప్రీ క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement