
మాడ్రిడ్ : ఆధునిక ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో తనెంత గొప్ప ఆటగాడో అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ మరోసారి చాటి చెప్పాడు. మూడు నెలల కిందట ఆరోసారి ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకొని పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో(5)ను అధిగమించిన మెస్సీ.. గతవారం ఏటా ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాలర్లకు ఇచ్చే ‘గోల్డెన్ బాల్’ను ఆరోసారి దక్కించుకొని మళ్లీ రొనాల్డో(5)ను దాటేసిన సంగతి తెలిసిందే.
తాజాగా మెస్సీ మరోసారి రొనాల్డో రికార్డును బ్రేక్ చేశాడు. యూరోప్‌లో విశేషాదరణ ఉన్న స్పానిష్ లీగ్ ‘లా లిగా’ ఫుట్‌బాల్ టోర్నీలో మెస్సీ 35వ హ్యాట్రిక్ సాధించాడు. టోర్నీలో బార్సిలోనా తరఫున ఆడుతున్న మెస్సీ ఆదివారం మల్లోర్కా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనత అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బార్సిలోనా జట్టు 5–2తో మల్లోర్కాపై గెలిచింది. కాగా, మెస్సీ తర్వాత 34 హ్యాట్రిక్‌లతో రొనాల్డో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment