
సంపత్‌నందితో మళ్లీ చేస్తా!
‘‘ఈ సినిమా మళ్లీ ఇంకోసారి ప్రేక్షకుల మధ్యలో చూడాలనుంది. అవకాశం వస్తే, మళ్లీ సంపత్‌నందితో సినిమా చేస్తా’’ అని రవితేజ చెప్పారు. రవితేజ, తమన్నా, రాశీఖన్నాలతో సంపత్‌నంది దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన ‘బెంగాల్ టైగర్’ విజయోత్సవం శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా సంపత్‌నంది మాట్లాడుతూ- ‘‘ఈ సినిమా నాకు హ్యాట్రిక్ కావాలని హీరో రవితేజ పదేపదే మనస్ఫూర్తిగా అన్నారు. పైన తథాస్తు దేవతలు ఉన్నారేమో అందుకే హిట్ అయింది.
బురదలో తీసిన ఫైట్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది’’అని అన్నారు. సంపత్‌నంది హ్యాట్రిక్ ఆనందంగా ఉందని నిర్మాత అన్నారు. ఈ వేడుకలో ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్, నాయిక తమన్నా పాల్గొన్నారు.