హామిల్టన్ హ్యాట్రిక్
* హంగేరి గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం
* సీజన్‌లో ఐదో విజయం
బుడాపెస్ట్: ఆద్యంతం ఆధిపత్యం కనబరుస్తూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ వరుసగా మూడో విజయాన్ని సాధించి ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. ఆదివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రిలో ఈ బ్రిటన్ డ్రైవర్ 70 ల్యాప్‌లను గంటా 40 నిమిషాల 30.115 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో హామిల్టన్‌కిది ఐదో విజయం కాగా, కెరీర్‌లో 48వ టైటిల్. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన నికో రోస్‌బర్గ్ (మెర్సిడెస్)ను తొలి ల్యాప్‌లోనే వెనక్కి నెట్టి ఆధిక్యంలోకి వచ్చిన హామిల్టన్ చివరి ల్యాప్ వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్నాడు.
రోస్‌బర్గ్‌కు రెండో స్థానం దక్కగా... రికియార్డో (రెడ్‌బుల్) మూడో స్థానాన్ని పొందాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్ పదో స్థానంలో, పెరెజ్ 11వ స్థానంలో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు జర్మనీ గ్రాండ్‌ప్రి ఈనెల 31న జరుగుతుంది.