Brett Lee Comments On Pacers: బౌలర్లకు విశ్రాంతినిచ్చే సంప్రదాయానికి తాను వ్యతిరేకమని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం బ్రెట్ లీ అన్నాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైతే పర్వాలేదని, కేవలం పని ఒత్తిడిని కారణంగా చూపి రెస్ట్ ఇవ్వడం సరికాదని ఈ స్సీడ్‌స్టర్ అభిప్రాయపడ్డాడు. పేసర్లు గాయాల బారిన పడకుండా ఉండేందుకు, కెరీర్‌ను సాఫీగా కొనసాగించే క్రమంలో క్రికెట్ బోర్డులు అనుసరిస్తున్న విధానాలను ఈ సందర్భంగా విమర్శించాడు.
కాగా వెస్టిండీస్‌తో స్వదేశంలో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్ నేపథ్యంలో బీసీసీఐ సైతం స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీకి విశ్రాంతినిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లెజెండ్స్ లీగ్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించిన బ్రెట్ లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘బౌలర్లకు రెస్ట్ ఇచ్చే రూల్స్‌కు నేను వ్యతిరేకిని. బౌలర్లు ప్రతి మ్యాచ్ ఆడితేనే నాకు ఇష్టం. ఒకవేళ వారు గాయం కారణంగా జట్టుకు దూరమైతే ఓకే.
కానీ.. విశ్రాంతి పేరిట పేస్ బౌలర్లను పక్కన పెట్టడం మంచిది కాదు. వాళ్లు మరింత కఠినంగా శ్రమిస్తూ... రోజురోజుకు ఆటను మెరుగుపరచుకుంటూ ముందుకు సాగితే చూడముచ్చటగా ఉంటుంది’’ అని చెప్పుకొచ్చాడు. ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా 2-1 తేడాతో ప్రొటిస్ చేతిలో సిరీస్ ఓడిపోయిన నేపథ్యంలో మాట్లాడుతూ... ‘‘ఇలాంటివి జరగడం సహజం. వాళ్లు (భారత జట్టు)బాగానే ఆడుతున్నారు.
ఆస్ట్రేలియాను సొంతగడ్డపై మట్టికరిపించారు. ఇంగ్లండ్‌ను ఓడించారు. ఇండియా జట్టు పటిష్టంగా ఉంది. అయితే, దక్షిణాఫ్రికా తమ స్వదేశంలో ఎంతో అద్భుతంగా ఆడింది. అందుకే సిరీస్ గెలిచింది’’ అంటూ బ్రెట్ లీ టీమిండియాకు బాసటగా నిలిచాడు. ఇదిలా ఉండగా ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని కంగారూలు ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. 4-0 తేడాతో ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసిన బ్రెట్ లీ.. బౌలర్‌గానూ, సారథిగానూ కమిన్స్ అద్భుతంగా రాణించాడని ప్రశంసలు కురిపించాడు.
చదవండి: India Captain: భవిష్యత్తు కెప్టెనా... అసలు అతడిలో ఏ స్కిల్ చూసి ఎంపిక చేశారు: సెలక్టర్లపై మండిపడ్డ మనోజ్ తివారి
IPL 2022: 'ఐపీఎల్‌లో ఆ జట్టుకు ఆడాలని ఉంది.. అతడే నా ఫేవరెట్ కెప్టెన్'
Comments
Please login to add a commentAdd a comment