Brett Lee Shows No Mercy His Son Gets Clean Bowled 150kmph Speed Goes Viral - Sakshi
Sakshi News home page

Brett Lee: కొడుకనే కనికరం లేకుండా క్లీన్‌బౌల్డ్‌

Published Fri, Dec 31 2021 6:21 PM | Last Updated on Fri, Dec 31 2021 7:48 PM

Brett Lee Shows NO MERCY His Son Gets Clean Bowled 150kmph Speed Viral - Sakshi

ఆస్ట్రేలియా స్పీడస్టర్‌ బ్రెట్‌ లీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి చాలా కాలమే అవుతుంది. అయినప్పటికి తన బౌలింగ్‌లో పదును మాత్రం పోలేదని మరోసారి నిరూపించాడు. తాజాగా 45 ఏళ్ల బ్రెట్‌ లీ తన కొడుకు ప్రీస్టన్‌తో కలిసి ఇంటి ఆవరణలోని గార్డెన్‌లో సరదాగా క్రికెట్‌ ఆడాడు. ఈ నేపథ్యంలో బ్రెట్‌ లీ బంతి విసిరాడు. బ్యాటింగ్‌ చేస్తున్న ప్రీస్టన్‌కు కనీసం టచ్‌ చేసే అవకాశం రాలేదు. ఈలోగా  బంతి వేగంగా పాదాల మధ్య నుంచి వచ్చి మిడిల్‌స్టంప్‌ను ఎగురగొట్టింది.

చదవండి: అన్ని ఫార్మాట్లలోనూ రోహిత్‌ ‘హిట్‌’... అశూ, అక్షర్‌ కూడా అద్భుతం!

దీనికి సంబంధించిన వీడియోను ఫాక్స్‌ క్రికెట్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. '' వయసు పెరుగుతున్న బ్రెట్‌ లీ బౌలింగ్‌లో పదును మాత్రం తగ్గలేదు. బంతిని వదిలేశారో ఇక అంతే సంగతులు.. కొడుకనే కనికరం లేకుండా క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు.'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది.ఇక 13 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా తరపున క్రికెట్‌ ఆడిన బ్రెట్‌ లీ అన్ని ఫార్మాట్లు కలిపి 718 వికెట్లు తీశాడు. 2003, 2007 వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో బ్రెట్‌ లీ సభ్యుడిగా ఉన్నాడు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement