
ముంబై:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పేసర్ శివం మావిపై ఆసీస్ దిగ్గజ క్రికెటర్ బ్రెట్ లీ ప్రశంసల వర్షం కురిపించాడు. మావిలోని సాంకేతికను, ఆత‍్మవిశ్వాసాన్ని చూస్తుంటే అతను భవిష్యత్తులో టీమిండియాలో కీలక పాత్ర పోషిస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు.
‘శివం మావి టీమిండియా ఆశాకిరణం కాగలడు. అతని బౌలింగ్ యాక్షన్ అసాధారణ రీతిలో ఉంది. ఒక పేసర్‌కు ఉండాల్సిన లక్షణాలన్నీ మావిలో ఉన్నాయి. క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తూ రాణిస్తున్నాడు. ఎవరైనా సక్సెస్ కావాలంటే ఎంజాయ్ చేస్తూ గేమ్‌ను ఆస్వాదించే లక్షణాలుండాలి. మావిలో ఒక అత్యుత్తమ బౌలర్ నాకు కనిపిస్తున్నాడు. నా దృష్టిలో మావి గొప్ప బౌలర్ అవుతాడు’ అని బ్రెట్ లీ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment