
PC: IPL Twitter
ఐపీఎల్ 2022లో భాగంగా శనివారం కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసింది. మ్యాచ్‌లో కేకేఆర్‌కు దారుణ పరాభవమే ఎదురైంది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 14.3 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలి.. తమ ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసింది.
అయితే లక్నో ఇన్నింగ్స్ సమయంలో శివమ్ మావి వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. అప్పటివరకు లక్నో 142 పరుగులు సాధారణ స్కోరుతోనే ఉంది. శివమ్ మావి వేసిన ఈ ఓవర్లో స్టొయినిస్ తొలి మూడు బంతుల్లో 6, 6, 6 బాది నాలుగో బంతికి అవుటయ్యాడు. తర్వాత వచ్చిన హోల్డర్ తర్వాతి 2 బంతులను 6, 6 కొట్టడంతో మొత్తం 5 సిక్సర్లతో ఆ ఓవర్లో 30 పరుగులు వచ్చాయి. మొత్తానికి శివమ్ మావి కేకేఆర్ పాలిట విలన్‌గా తయారయ్యాడు.
ఇంతవరకు ఒక కేకేఆర్ బౌలర్ మూడు సందర్భాల్లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్నాడు. యాదృశ్చికమేంటంటే.. ఈ మూడుసార్లు శివమ్ మావినే ఉండడం విశేషం. శనివారం లక్నోతో మ్యాచ్‌తో పాటు.. 2018 ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో.. అదే సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో మావి ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్నాడు.
చదవండి: IPL 2022: కేకేఆర్‌ను కుమ్మేసిన లక్నో..