IPL 2022: Mystery Girl Steals Show During KKR Vs LSG Match, Pics Viral - Sakshi
Sakshi News home page

KKR VS LSG: కెమెరాకు చిక్కిన మిస్టరీ గర్ల్‌.. తన అందంతో కట్టిపడేసింది

Published Thu, May 19 2022 4:47 PM | Last Updated on Thu, May 19 2022 7:53 PM

IPL 2022: Mystery Girl Steals Show During KKR Vs LSG Match Goes Viral - Sakshi

PC: IPL Twitter

ఐపీఎల్‌ అంటేనే మజాకు పెట్టింది పేరు. బ్యాట్స్‌మెన్‌ సిక్సర్ల వర్షం.. బౌలర్ల వికెట్ల వేట.. వెరసి మ్యాచ్‌ చూడడానికి వచ్చే ప్రేక్షకులను కనువిందుగా అనిపిస్తుంది. అదే ప్రేక్షకుల్లో కొందరు మాత్రం తమ హావభావాలతో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలుస్తుంటారు. ఐపీఎల్‌ మొదలైనప్పటికి నుంచి ఇలాంటివి చాలానే చూశాం.. చూస్తున్నాం కూడా. అయితే ఈ ప్రక్రియలో ఎక్కువసార్లు హైలైట్‌ అయ్యేది మనకు తెలిసిన వాళ్లో లేక క్రికెటర్ల భార్యలు అయి ఉంటారు. కానీ అప్పుడప్పుడు మనకు తెలియని వ్యక్తులు కూడా హైలైట్‌గా నిలుస్తారు.

తాజాగా కేకేఆర్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఒక యువతి సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. స్టాండ్స్‌ నుంచి మ్యాచ్‌ను చూస్తూ ఆ యువతి ఎంజాయ్‌ చేస్తుంటే.. ఆమె అందానికి ఫిదా అయ్యామా అన్నట్లుగా కెమెరా యాంగిల్స్‌ అన్ని ఆమెవైపే తిరిగాయి. ప్రస్తుతం సదరు యువతి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ ఎవరా అమ్మాయి అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి ఎవరు..?  ఏ జట్టుకి సపోర్టు చేయడానికి వచ్చింది అనే వివరాలు మాత్రం తెలియరాలేదు.

మొత్తానికి తన అందంతో ఎంతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. కాగా ఇంతకముందు కూడా ఇదే సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్‌ మధ్య మ్యాచ్‌లో ఒక యువతి ఫోటోలు వైరల్‌గా మారాయి. మొదట ఆ అమ్మాయి ఎవరో తెలియకపోయినా.. తర్వాత.. ఆమె పేరు ఆర్తి బేడీ అని... డ్యాన్సర్‌ అని తెలిసింది. కాగా ఆ మ్యాచ్ తర్వాత ఆర్తి బేడీ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. లక్నో సూపర్‌ జెయింట్స్‌ కేకేఆర్‌పై రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో లక్నో ప్లేఆఫ్‌ చేరగా.. గతేడాది రన్నరప్‌గా నిలిచిన కేకేఆర్‌ లీగ్‌ దశలోనే వైదొలిగింది.

చదవండి: గంభీర గర్జన.. కేకేఆర్‌పై గెలుపు అనంతరం లక్నో మెంటార్‌ ఉద్వేగం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement