PC: IPL Twitter
పుణే: ఐపీఎల్ తాజా సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసి అగ్ర స్థానానికి దూసుకుపోగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) మరో పేలవ ప్రదర్శనతో కుప్పకూలింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో లక్నో 75 పరుగులతో నైట్‌రైడర్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. డి కాక్ (29 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించగా... దీపక్ హుడా (27 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం కోల్‌కతా 14.3 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. రసెల్(19 బంతుల్లో 45; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యా రు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవేశ్ ఖాన్ (3/19), హోల్డర్ (3/31) కోల్‌కతాను దెబ్బ తీశారు.
ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే రాహుల్ (0) రనౌట్ కావడంతో డి కాక్, హుడా కలిసి జట్టును ఆదుకున్నారు. రెండో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. చివర్లో స్టొయినిస్ (14 బంతుల్లో 28; 1 ఫోర్, 3 సిక్స్‌లు) జోరుతో లక్నో మెరుగైన స్కోరు సాధించగలిగింది. ఛేదనలో కోల్‌కతా దారుణంగా విఫలమైంది. ఇంద్రజిత్ (0), శ్రేయస్ (6), ఫించ్ (14), నితీశ్ రాణా (2) విఫలం కావడంతో 25 పరుగులకే ఆ జట్టు 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రసెల్ మెరుపులు ఇన్నింగ్స్‌కు కాస్త ఊపు తెచ్చాయి. ముఖ్యంగా హోల్డర్ ఓవర్లో వరుస బంతుల్లో 6, 6, 2, 6, 4 బాది రసెల్ దూకుడు ప్రదర్శించాడు. అయితే అదే ఊపులో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి అతను అవుట్ కావడంతో కేకేఆర్ గెలుపు దారులు మూసుకుపోయాయి.
ఒకే ఓవర్లో 30 పరుగులు
లక్నో ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్ హైలైట్‌గా నిలి చింది. శివమ్ మావి వేసిన ఈ ఓవర్లో స్టొయినిస్ తొలి మూడు బంతుల్లో 6, 6, 6 బాది నాలుగో బంతికి అవుటయ్యాడు. తర్వాత వచ్చిన హోల్డర్ తర్వాతి 2 బంతులను 6, 6 కొట్టడంతో మొత్తం 5 సిక్సర్లతో ఆ ఓవర్లో 30 పరుగులు వచ్చాయి.
WHAT A WIN this for the @LucknowIPL. They win by 75 runs and now sit atop the #TATAIPL Points Table.
— IndianPremierLeague (@IPL) May 7, 2022
Scorecard - https://t.co/54QZZOwt2m #LSGvKKR #TATAIPL pic.twitter.com/NYbP1S2xIt
Comments
Please login to add a commentAdd a comment