
మళ్లీ ఇంటివాడైన బ్రెట్ లీ
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ బ్రెట్ లీ తన ప్రియురాలు లానా అండర్సన్‌ను వివాహమాడాడు.
అతనికిది రెండో వివాహం. సీఫోర్త్‌లోని తన నివాసంలో సన్నిహితుల మధ్య గత వారం ఈ పెళ్లి జరిగింది. 2008లో మొదటి భార్య ఎలిజబెత్ కెంప్‌కు లీ విడాకులిచ్చాడు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. 37 ఏళ్ల లీ గతేడాది నుంచి లానాతో డేటింగ్ చేస్తూ సహజీవనం చేస్తున్నాడు.