టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. అక్తర్ బౌలింగ్‌ను చక్కర్ అంటూ ఒక టీవీ ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. సెహ్వాగ్ మాట్లాడుతూ.. '' అక్తర్ తన ఎల్బోను కదలిస్తూ బౌలింగ్ చేసేవాడు. ఈ తరహా బౌలింగ్‌ను క్రికెట్ భాషలో చక్కర్ అని సంబోధిస్తారు. అందుకే అక్తర్ బౌలింగ్‌ను ఐసీసీ కొంతకాలం బ్యాన్ చేసింది. ఇక ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్ లీ బౌలింగ్ యాంగిల్ కాస్త డౌన్‌లో వస్తుంది.. అందువల్ల అతని బౌలింగ్ పెద్ద కష్టంగా అనిపించదు.
అయితే షోయబ్ బౌలింగ్‌లో మాత్రం బంతి ఎక్కడి నుంచి వస్తుందో తెలిసేది కాదు. అందుకే అక్తర్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం కాస్త కష్టంగా అనిపించేది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ షేన్ బాండ్ కూడా నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్లలో ఒకడు. అతని స్వింగ్ బౌలింగ్ ఎక్కువగా ఆఫ్‌స్టంప్ అవతల పడుతూ బ్యాట్స్‌మెన్లను ఇబ్బంది పెట్టేవి. ఇక బ్రెట్ లీ బౌలింగ్‌లో ఆడడం పెద్దగా భయం లేనప్పటికి.. అక్తర్‌ను మాత్రం మనం నమ్మలేం. అతను సంధించే బీమర్.. యార్కర్ ఎక్కడ నా కాలుకు తగులుతుందోనని భయపడేవాడిని. కానీ బ్యాటింగ్ మాత్రం ఎప్పుడు కంఫర్ట్‌గానే ఉండేది.'' అంటూ వెల్లడించాడు.
ఇక అక్తర్ బౌలింగ్‌ను సెహ్వాగ్ సహా.. మాజీ క్రికెటర్లు సచిన్, గంగూలీ, ద్రవిడ్, లక్ష్మణ్‌లు బాగా ఎంజాయ్ చేసేవారు. ముఖ్యంగా సెహ్వాగ్ పాకిస్తాన్‌పై 90 సగటుతో ఒక సెంచరీ, రెండు డబుల్ సెంచరీలు, ఒక ట్రిపుల్ సెంచరీ అందుకోవడం విశేషం.
చదవండి: Andrew Symonds: కన్నీరు తెప్పిస్తున్న ఆండ్రూ సైమండ్స్ సోదరి లేఖ
Comments
Please login to add a commentAdd a comment