'భారత క్రికెట్ను ఎంజాయ్ చేస్తున్నా' | I have enjoyed is watching India play, Brett Lee | Sakshi
Sakshi News home page

'భారత క్రికెట్ను ఎంజాయ్ చేస్తున్నా'

Published Thu, Jun 8 2017 8:26 PM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM

'భారత క్రికెట్ను ఎంజాయ్ చేస్తున్నా'

'భారత క్రికెట్ను ఎంజాయ్ చేస్తున్నా'

గత కొంతకాలంగా భారత క్రికెట్ చూడటాన్ని ఎంజాయ్ చేస్తున్నానని అంటున్నాడు ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ బ్రెట్ లీ.

లండన్: గత కొంతకాలంగా భారత క్రికెట్  చూడటాన్ని ఎంజాయ్ చేస్తున్నానని అంటున్నాడు ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ బ్రెట్ లీ. అన్ని రంగాల్లోనూ బలంగా ఉన్న టీమిండియా చాలా మంచి క్రికెట్ ఆడుతుందంటూ కితాబిచ్చాడు. చాంపియన్స్ ట్రోఫీలో  డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత జట్టుకే మరొకసారి టైటిల్ ను గెలిచే సత్తా ఉందన్నాడు.

 

'చాలాకాలంగా భారత క్రికెట్ మంచి ఫలితాలు సాధిస్తుంది. ఇప్పుడు ఆ జట్టు చాలా పటిష్టంగా ఉంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ ల్లో సమతుల్యతను కల్గి ఉంది. మంచి క్రికెట్ ఆడుతున్న భారత క్రికెట్ ను చూడటాన్ని ఎంజాయ్ చేస్తున్నా. చాంపియన్స్ ట్రోఫీని గెలిచే అవకాశాలు భారత్ కే ఉన్నాయి. కాకపోతే ఆస్ట్రేలియా టైటిల్ ను సాధించాలని కోరుకుంటున్నా'అని బ్రెట్ లీ తెలిపాడు.గత ఆదివారం పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ భారీ విజయం సాధించడాన్ని బ్రెట్ లీ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. పాక్ పై భారత్ సాధించిన విజయం నిజంగా అద్భుతమని కొనియాడాడు. అదొక పరిపూర్ణ విజయంగా బ్రెట్ లీ అభివర్ణించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement