ఫైనల్‌లో అంతే.. కోహ్లి చెత్త రికార్డు..! | Kohli in tournament finals | Sakshi
Sakshi News home page

ఫైనల్‌లో అంతే.. కోహ్లి చెత్త రికార్డు..!

Published Sun, Jun 18 2017 8:30 PM | Last Updated on Tue, Sep 5 2017 1:56 PM

ఫైనల్‌లో అంతే.. కోహ్లి చెత్త రికార్డు..!

ఫైనల్‌లో అంతే.. కోహ్లి చెత్త రికార్డు..!

ప్రస్తుత భారత జట్టులో డ్యాషింగ్‌ బ్యాట్స్‌మన్‌గా విరాట్‌ కోహ్లికి ఘనమైన చరిత్ర ఉంది. సెంచరీల మీద సెంచరీలు చేయడమే కాదు అనేక మ్యాచుల్లో భారత్‌ను గెలిపించిన ఘనత అతనిది. మూడు ఫార్మెట్లలోనూ సారథిగా బాధ్యతలు చేపట్టి జట్టుకు వరుస విజయాలను కోహ్లి అందిస్తూ వచ్చాడు. జట్టు ప్రతిష్టను పెంచాడు. కానీ కోహ్లిపై ఒక మచ్చ ఉంది. అదే కీలకమైన ఫైనల్‌ మ్యాచుల్లో ఆడకపోవడం. విరాట్‌ కోహ్లి ఇప్పటివరకు ఎనిమిది ఫైనల్‌ మ్యాచులు ఆడాడు. కానీ ఒక్క ఫైనల్‌ మ్యాచ్‌లోనూ కోహ్లి సెంచరీగానీ, అర్ధసెంచరీగానీ చేయలేదు. ఈ ఎనిమిది ఫైనల్‌ మ్యాచుల్లోనూ కోహ్లి బ్యాటింగ్‌ సగటు 22 మాత్రమే.

అత్యంత కీలకమైన చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లోనూ కోహ్లి చేతులెత్తేశాడు. ఆమిర్‌ బౌలింగ్‌లో మొదట స్లిప్‌లో క్యాచ్‌ మిస్‌ అయి.. లైఫ్‌ దొరికినా.. దానిని కోహ్లి సద్వినియోగం చేసుకోలేదు. ఆ వెంటనే ఆమిర్‌ బౌలింగ్‌లోనే కోహ్లి పెవిలియన్‌ బాట పట్టాడు. ఫైనల్‌లో ఏమాత్రం ఆడిన ఘనత లేని కోహ్లి దాయాది పోరులో ఇంతకన్నా ఎక్కువ స్కోరు చేస్తాడని తాము ఆశించలేమని పలువురు నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement