
మైదానంలో భావోద్వేగాలు ప్రదర్శించడం, దూకుడుగా కనిపించడం ఆటలో భాగమే. మైదానంలో రోబోల్లా కనిపించే ఆటగాళ్లను మేం చూడాలనుకోవడం లేదు. అయితే క్రికెటర్లు తమ పరిధి దాటకుండా ఉండటం కూడా ముఖ్యం. బూతులు మాట్లాడకుండా కూడా దూకుడు ప్రదర్శించవచ్చు.
ఇటీవలి జరిగిన కొన్ని సంఘటనలకు (రబడ తరహా) నేను మద్దతివ్వడం లేదు కానీ శిక్షల భయంతో ఆటగాళ్లు కనీసం ఒకరి వైపు మరొకరు కూడా చూసుకోకుండా ఉండే పరిస్థితి రావడం మంచిది కాదు.
– బ్రెట్ లీ, ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్