మా అబ్బాయి అతనికి పెద్ద అభిమాని: బ్రెట్ లీ | Brett Lee admits his son is a big fan of Indian skipper Virat Kohli | Sakshi
Sakshi News home page

మా అబ్బాయి అతనికి పెద్ద అభిమాని: బ్రెట్ లీ

Published Tue, Jul 25 2017 11:38 AM | Last Updated on Tue, Sep 5 2017 4:51 PM

మా అబ్బాయి అతనికి పెద్ద అభిమాని: బ్రెట్ లీ

మా అబ్బాయి అతనికి పెద్ద అభిమాని: బ్రెట్ లీ

న్యూఢిల్లీ:పరుగుల మెషీన్, భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లి అభిమానుల జాబితాలో ఇప్పుడు ఆసీస్ మాజీ బౌలర్ బ్రెట్ లీ కుమారుడు కూడా చేరిపోయాడు. ఈ విషయాన్ని తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్పీఎల్) కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన బ్రెట్ లీ స్వయంగా వెల్లడించాడు. తన 10 ఏళ్ల కుమారునికి విరాట్ బ్యాటింగ్ అంటే విపరీతమైన ఇష్టమని పేర్కొన్న బ్రెట్ లీ.. దీన్ని విరాట్ కు ఒకానొక సందర్భంలో తెలియజేసినట్లు పేర్కొన్నాడు.

'నా కొడుకు ఫేవరెట్ బ్యాట్స్మన్ ఎవరైనా ఉన్నారంటే అది విరాట్ కోహ్లి. ఒకసారి కోహ్లితో కరాచలనం చేసే క్రమంలో నా కుమారుడికి మీ బ్యాటింగ్ ఇష్టమని విషయాన్నితెలియజేశా. అప్పుడు విరాట్ తన టెస్టు టీ షర్ట్ల్లో ఒక దానిని సంతకం చేసి నా కుమారుడికి కానుకగా ఇచ్చాడు. అని బ్రెట్ లీ పేర్కొన్నాడు. క్రికెట్ ను ప్రేమిస్తూ ఆడటం వల్లే విరాట్ వరుసగా రికార్డులను తన ఖాతాలో వేసుకుంటూ ముందుకు సాగుతున్నాడన్నాడు. భారత్ క్రికెట్ లో సచిన్ తరువాత అంతటి అభిమానాన్ని చూరగొన్నది కోహ్లినేనని బ్రెట్ లీ తెలిపాడు. సచిన్!, సచిన్! అనే అభిమానుల స్వరం ఇప్పుడు కోహ్లి,కోహ్లిగా మారిపోయిందన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement