కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడని తెలుస్తుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని సమాచారం. ఈ సీజన్‌లో లక్నో ఆడబోయే తదుపరి రెండు మ్యాచ్‌ల్లో రాహుల్ సాధారణ ఆటగాడిగా కొనసాగుతాడని ప్రముఖ వార్తా సంస్ధ వెల్లడించిన నివేదిక ద్వారా తెలుస్తుంది.
సన్‌రైజర్స్‌తో నిన్నటి మ్యాచ్ తదనంతర పరిణామాల్లో రాహుల్ ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సన్‌రైజర్స్ చేతిలో దారుణ పరాభవాన్ని ఎదుర్కొన్న అనంతరం లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయంకా రాహుల్ పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. అందరూ చూస్తుండగానే రాహుల్‌పై మాటల దాడికి దిగాడు.
గొయెంకా నుంచి ఈ తరహా ప్రవర్తనను ఊహించని రాహుల్ తీవ్ర మనస్థాపానికి గురై కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. రాహుల్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి మరో కారణం కూడా ఉందని తెలుస్తుంది.
గొయెంకా తదుపరి సీజన్‌లో రాహుల్‌ను వదించుకోవాలని సన్నిహితుల వద్ద ప్రస్తావించాడని సమాచారం. గొయెంకాకు ఆ అవకాశం ఇవ్వడమెందుకని రాహులే స్వయంగా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రచారం జరగుతుంది. 2022 సీజన్‌లో లక్నో టీమ్ లాంచ్ అయినప్పుడు రాహుల్‌ను గొయెంకా 17 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకున్నాడు.
ఈ సీజన్‌లో లక్నో ఆడబోయే తదుపరి మ్యాచ్‌కు ఐదు రోజుల సమయం ఉండటంతో రాహుల్ నిర్ణయం ఏ క్షణానైనా వెలువడవచ్చని సమాచారం. గొయెంకా గతంలో పూణే వారియర్స్ అధినేతగా ఉన్నప్పుడు ధోని విషయంలోనూ ఇలాగే వ్యవహరించాడు. ఓ సీజన్ తర్వాత ధోనిని తప్పించి స్టీవ్ స్మిత్‌ను కెప్టెన్‌గా నియమించాడు.
ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఓడినప్పటికీ లక్నో ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. లక్నో తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిస్తే 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. అయితే ఈ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ మిగిలిన జట్ల జయాపజయాలపై అధారపడి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment