ఆసియాకప్-2022కు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా ఈవెంట్ కోసం తమ జట్టు అసిస్టెంట్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ ఉమర్ రషీద్‌ను యూఏఈకు పీసీబీ పంపించింది. రషీద్ ప్రస్తుతం.. లాహోర్‌లోని నేషనల్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో బౌలింగ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు.
మొహమ్మద్ హస్నైన్ వంటి అత్య్తుత్తమ బౌలర్లను తయారు చేయడంలో రషీద్ కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ టోర్నీలో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ షాన్ టైట్‌తో కలిసి పనిచేయనున్నాడు. ఇక ఉమర్ రషీద్ తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో మిడిల్‌సెక్స్, సస్సెక్స్ జట్టుల తరపున ఆడాడు. కాగా ఆసియకప్‌కు ఆ జట్టు స్టార్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిది గాయం కారణంగా దూరమయ్యాడు .
అతడి స్థానంలో పేసర్ మొహమ్మద్ హస్నైన్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. ఇక ఈ మెగా ఈవెంట్‌లో పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 28న భారత్‌తో తలపడనుంది. ఇక ఇప్పటికే యూఏఈకు చేరుకున్న ఇరు జట్లు తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాయి.
ఆసియాకప్‌కు పాకిస్తాన్ జట్టు
బాబర్ ఆజం(కెప్టెన్), షాబాద్ ఖాన్, ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హారిస్ రవూఫ్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్‌దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీం షా, షానవాజ్ దహాని, ఉస్మాన్ ఖాదిర్, మహ్మద్ హస్నైన్.
చదవండి: Asia Cup 2022 Ind Vs Pak: బాబర్ ఆజంను పలకరించిన కోహ్లి.. వీడియో వైరల్! రషీద్‌తోనూ ముచ్చట!
Comments
Please login to add a commentAdd a comment