ముంబై: ఆస్ట్రేలియా మాజీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ డేమియన్ రైట్‌ను తమ కొత్త బౌలింగ్ కోచ్‌గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ నియమించుకుంది. 45 ఏళ్ల రైట్ ఇప్పటికే బంగ్లాదేశ్ అండర్ –19 క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా సేవలందిస్తున్నారు. పంజాబ్ కింగ్స్ కోచ్ అనిల్ కుంబ్లే పర్యవేక్షణలో పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్లు రైట్ పేర్కొన్నాడు. రైట్ గతంలో బిగ్‌బాష్ లీగ్ జట్టు హోబర్ట్ హరికేన్స్, మెల్‌బోర్న్ స్టార్స్‌తో పాటు న్యూజిలాండ్ జాతీయ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఐపీఎల్–2021 సీజన్ ఏప్రిల్ 9న మొదలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment